సెల్‌ఫోన్ కొట్టేయాలని చూసి కాళ్లు పోగొట్టుకున్న దొంగ

సెల్‌ఫోన్ కొట్టేయాలని చూసిన ఓ దొంగ ప్రాణాలపైకి తెచ్చుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది.రైలులో ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్ కొట్టేయాలని ప్రయత్నించిన దొంగ అదే రైలు కిందపడి తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.

 Thief Lost Legs While Trying To Rob Cellphone-TeluguStop.com

వరంగల్‌లో జరిగిన ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

వరంగల్‌ వైపు వెళుతున్న రైలులో నసీర్(20) అనే యువకుడు ఓ ప్రయాణికుడి వద్ద సెల్‌ఫోన్ కొట్టేశాడు.

ఇది గమనించిన సదరు ప్రయాణికుడు కేకలు వేయడంతో నసీర్ కదులుతున్న రైలు నుంచి దూకేశాడు.అయితే అతడు అదుపు తప్పి అదే రైలు కింద పడిపోయాడు.దీంతో అతడి రెండు కాళ్లు తెగిపడ్డాయి.తెల్లవారుఝామున జరిగిన ఈ ఘటన సమయంలో చీకటిగా ఉండటంతో నసీర్ అతడు దొంగలించిన సెల్‌ఫోన్‌తోనే 108కు ఫోన్ చేసి సాయం కోసం అడిగాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది చీకటి కావడంతో నసీర్ కోసం గంటపాటు వెతికారు.రక్తపుమడుగులో ఉన్న నసీర్‌ను చూసిన వారు అతడిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు.ఒక సెల్‌ఫోన్ దొంగతనం చేయబోయిన నసీర్ చివరకు తన రెండు కాళ్లు పోగొట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube