దొంగల్లో మంచి దొంగలు వేరయా,బామ్మకు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు!

దొంగలు పని కేవలం అందిన కాడికి దోచుకుంటూ ఉంటారు.గన్ లతో బెదిరించి మరీ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.

 Thief Kisses Elderly Lady Refuses To Take Her Cash-TeluguStop.com

కొందరైతే ఆ సమయంలో ఒకడుగు ముందుకు వేసి హత్యలు కూడా చేస్తూ ఉంటారు.కానీ ఈ దొంగ గురించి వింటే మాత్రం తప్పకుండా దొంగల్లో మంచి దొంగలు వేరయా అని అనకుండా ఉండరు.

ఎందుకంటే దొంగతనానికి వచ్చిన దొంగ ఒక వృద్ధురాలి నుదుటి పై ముద్దుపెట్టి డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియా లో రావడం తో ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ గా మారింది.మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఇలా వీడియో బయటకు రావడం తో ఇప్పుడు ఆ విషయం తెగ వైరల్ గా మారింది.

వివరాల్లో వెళితే… బ్రెజిల్ లో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒక ఫార్మసీ లోకి చొరబడిన ఇద్దరు దొంగలు వ్యాపారిని గన్ తో బెదిరిస్తూ డబ్బులు,వస్తువులు దోచుకున్నారు.అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వృద్ధ కస్టమర్ దొంగలకు భయపడి తన డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించింది.

అయితే, వారిలో ఒక దొంగ అందుకు నిరాకరించడమే కాకుండా ‘నాకు డబ్బులు వద్దు మేడమ్.దయచేసి సెలెంట్‌గా ఉండండి’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి వెళ్లిపోయాడు.

Telugu Brazil, Elderly Lady, Thiefkisses-

  అయితే ఈ ఘటన కు సంబందించిన దృశ్యాలు అన్నీ కూడా షాప్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో ఆ దృష్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఈ ఘటనలో దొంగలు రూ.71,155, దుకాణంలోని కొన్ని వస్తువులను దొంగలించారని షాప్ ఓనర్ శామ్యూల్ అల్మిదా తెలిపాడు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా రికార్డు ల ఆధారముగా దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube