క్రికెట్ గ్రౌండ్‌లోకి ఎంట‌ర్ అయిన దొంగ.. చివ‌ర‌కు ఏమైందంటే...?

దొంగ‌తనం అంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్న ప‌ని.ఆ ప‌ని చేయాలంటే ఎవ‌రూ లేని చోట మాత్ర‌మే అది సాధ్యం అవుతుంది.

 The Thief Who Entered The Cricket Ground What Happened In The End, Thief, Crick-TeluguStop.com

లేదంటే చాలా మంది బిజీగా ఉన్న ర‌ద్దీ ప్రాంతాల్లోనే వ‌ర్కౌట్ అవుతుంది.అలా కాద‌ని ఏ మాత్రం పొర‌పాటు చేసినా కూడా చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాల‌వ్వాల్సిందే.

ఇక ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది ఓ వింత దొంగ గురించి.ఇప్ప‌టికే మనం న‌గ‌ల షాపుల్లోకి వచ్చి ఈజీగా న‌గ‌లు దొంగిలించిన వారి గురించి ఎన్నో వీడియోల‌ను చూస్తూనే ఉన్నాం.

కానీ ఈ దొంగ మాత్రం కొంత విచిత్రంగా ఆలోచించి ఏకంగా క్రికెట్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

క్రికెట్ గ్రౌండ్‌లో సాధార‌ణంగానే మ్యాచు ఆడుతూ ఆటగాళ్లంతా చాలా బిజీగా ఉన్నారు.

ఇక త‌న ప‌ని కానివ్వాల‌ని డిసైడ్ అయిన ఈ దొంగ అక్క‌డే ఉన్న వారి పర్సులపై కన్నేసి క్షణాల్లో చేసేసి తన పని కంప్లీట్ చేసాడు.అయితే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా సీన్‌లోకి ఎంటరైన పోలీసులకు కూడా ఈ దొంగ బాగానే చుక్కలు చూపించాడ‌ని తెలుస్తోంది.

కానీ ఎన్ని చేసినా చివరికి పోలీసుల‌కు ఈ దొంగ పట్టుబడ్డాడు.ఇదంతా లండ‌న్‌లో జరిగిన చెర్వెల్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న గురించి మ‌నం చెప్పుకునేది.

Telugu Chervelleague, Cricket Ground, London, Thief-Latest News - Telugu

అయితే ఈ క్రికెట్ గ్రౌండ్‌లో స్టాంటన్ హార్కోర్ట్ క్రికెట్ క్లబ్‌తో వుల్వర్‌కోట్ క్లబ్ జ‌ట్టు పోటా పోటీగా మ్యాచ్ ఆడుతుండ‌గా అక్క‌డ‌కు ఓ దొంగ ఎంటరయ్యాడు.సీరియ‌స్ గా ఆడుతున్న ఆటగాళ్ల పర్సుల నుంచి చాలా తెలివిగా డ‌బ్బుల‌ను కొట్టేశాడు ఈ దొంగ‌.దాంతో ఈ దొంగ‌త‌నం వార్త కాస్తా క్రికెట్ ఆటగాళ్లకు తెలియ‌డంతో ఆ దొంగ ప‌ని ప‌ట్టేందుకు వారంతా అలెర్ట్ అయ్యి పోలీసుల‌ను కూడా ఎంట‌ర్ చేశారు.ఇక వారంతా చాక చ‌క్యంగా వెతికి ఆ దొంగ‌ను ఇట్టే ప‌ట్టేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube