మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోంది.కొందరు కిరాతకులు పట్టపగలే, అందరూ చూస్తుండగానే క్రూరంగా ఇతరులను చంపేస్తూ సామాన్యులకు హడలు పుట్టిస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో ఇలాంటి దారుణం మరొకటి జరిగింది.బరౌలాలో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తితో తీవ్రంగా గాయపరిచి బైక్‌కు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్ళారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసి చాలామంది షాక్ అవుతున్నారు.
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పేరు హసన్( Hasan ) అని తెలిసింది.అతడు నాలుగేళ్ల క్రితం అనూజ్( Anuj ) అనే వ్యక్తి తండ్రితో గొడవపడ్డాడు.హసన్‌పై కత్తి దాడి చేసిన వ్యక్తుల్లో అనూజ్ ఒకడు.
పాత గొడవల కారణంగా అనూజ్ స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.తరువాత అనూజ్, అతడి అనుచరుడు నితిన్ పోలీసుల ఎదుట శనివారం రాత్రి 11 గంటలకు సరెండర్ అయ్యారు.
మెహందీ హసన్ అని కూడా పిలిచే హసన్‌ను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అతను చికిత్స పొందుతూ మరణించాడు.ఈ విషయం తెలిసి హసన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
హత్య చేసిన వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
@ItsKhan_Saba ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 2000 దాకా వ్యూస్ వచ్చాయి.చాలామంది ఇలాంటి హత్యలు ఇంకెన్ని జరుగుతాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్యాయంగా ఒకరి ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదని, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఒక బలమైన మెసేజ్ ను ప్రజల్లోకి పంపించాలని కొందరు కోరుతున్నారు.ఈ షాకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.