ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించారు... కానీ పెన్ను....   They Love The Same Girl Pen A Knife With A Knife     2018-10-19   07:33:49  IST  Sai M

ప్రేమో ఆకర్షణో తెలియని వయసులో ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. కానీ అది చిన్న గొడవగా ప్రారంభం అయ్యి ఆఖరికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. నిండా పదిహేడేళ్లు కూడా నిండని బాలుడు తనకంటే ఏడాది పెద్దవాడయిన డిగ్రీ యువకుణ్ని పొడిచి చంపినా ఘటన ఈ విచార సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కలకలం రేపింది. వివరాలు పరిశీలిస్తే… జగిత్యాల గ్రామీణ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సాదినేని నవీన్(18) జగిత్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అదే గ్రామానికి చెందిన బాలుడు(17) తన వీధిలో నివసించే ఓ అమ్మాయి మీద మనసుపడ్డాడు.

తాను ఇష్టపడిన అమ్మాయి కోసం నవీన్ తరచూ తన వీధిలోకి వస్తున్నట్టు బాలుడు గుర్తించాడు. అతన్ని నిలదీశాడు. ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బాలుడు సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి నవీన్ నివసించే వీధిలోకి వెళ్లాడు. అందరూ మద్యం తాగినట్టు సమాచారం. అనంతరం నవీన్ ను పిలిపించి గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో బాలుడు పెన్ కత్తితో నవీన్ ను పొడిచాడు. గుండె సమీపంలో కత్తి గుచ్చుకోవడంతో అపస్మారకస్థితికి చేరిన నవీన్ జగిత్యాల వైద్యశాలకు తరలించే లోపే మృతి చెందాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.