బాబుని వ‌ద‌ల‌ని విజ‌య‌సాయి.. ఈసారి మ‌రీ దారుణం..!

వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా టీడీపీ నాయ‌కులకు త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్లు వేస్తుంటారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.ఇక ఆయ‌న ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై విరుచుకుప‌డుతున్నారు.

 They Have Defeated Babu This Time It Is Very Bad , Vijaya Sai, Chandra Babu, Ap,-TeluguStop.com

ప్ర‌స్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ నేత‌ల మ‌ధ్య కృష్ణా నీళ్ల‌పై వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా దీనిపై ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు స్పందించక‌పోవ‌డంతో దీన్ని అడ్వాంటేజీగా తీసుకుని ఇప్ప‌టికే సీఎం వైఎస్ జగన్ స్వ‌యంగా ధ్వ‌జ‌మెత్తారు.

ఆంధ్రాకు బాబు హ‌యాంలోనే అన్యాయం జ‌రిగినా ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని, క‌నీసం ఇప్పుడు కూడా నోరు తెర‌వ‌ట్లేద‌ని నిన్న అనంతపురం సభలో జ‌గ‌న్ నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే.ఇక తానేం త‌క్కువ కాదంటూ వైసీపీలో కీల‌కంగా ఉంటున్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుపై దారుణ‌మైన కామెంట్లు చేశారు.

Telugu Apvijaya, Chandra Babu, Jagan, Krishnawaters-Telugu Political News

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కృష్ణా జలాల వివాదం ముదిరితే సంతోషిస్తున్న ఏపీ ద్రోహి చంద్రబాబు నాయుడు అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.ఇక అక్క‌డితో ఆగ‌కుండా చంద్ర‌బాబు ప్ర‌స్తుతం హైదరాబాద్ వదిలి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, ఒక‌వేళ ఆయ‌న గ‌న‌క రాయలసీమలోకి వ‌స్తే చావ‌బాదుతారంటూ వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు.ఇక కోస్తాకు కూడా చంద్ర‌బాబు వేడి తాకేలా ఆయ‌న అక్క‌డ‌కు వెళ్లినా ఉతికారేస్తారంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు.దీంతో విజ‌య‌సాయి రెడ్డి కామెంట్లు ప్ర‌స్తుతం విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

ఒక మాజీ ముఖ్యమంత్రిని ప‌ట్టుకుని మ‌రీ ఇంత‌లా మాట్లాడాలా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.ఏదేమైనా క‌నీసం ఆయ‌న వ‌య‌స్సుకైనా మ‌ర్యాద ఇవ్వాలంటూ కోరుతున్నారు.

కానీ ఎవ‌రెన్ని అన్నా విజ‌య‌సాయి మాత్రం త‌న పంథాను మార్చ‌కుండా ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.చూడాలి మ‌రి తెలుగు త‌మ్ముళ్లు దీనిపై ఏమైనా స్పందిస్తారో లేదో అన్న‌ది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube