పెదాలను వాళ్ళు పాడు చేశారు.. దయచేసి సర్జరీ చేయించుకోకంటూ శ్రీలీలకు అభిమాని సలహా?

ఏ అమ్మాయి అయినా సరే నాచురల్ గా ఉంటేనే ఇష్టపడుతుంటారు అబ్బాయిలు.ఎందుకంటే మేకప్ రూపాన్ని వాళ్ళు అసలు ఇష్టపడరు.

 They Have Damaged Her Lips Please Advise Sri Leela Not To Undergo Surgery ,sreel-TeluguStop.com

అలా హీరోయిన్ల విషయంలో కూడా నాచురల్ ని ఇష్టపడతారు.ఎవరైనా హీరోయిన్లు నాచురల్ గా ఉంటే వారిని లైక్ చేస్తారు.

ఒకవేళ వాళ్ళు బాగా మేకప్ తో కనిపిస్తే మాత్రం వెంటనే ట్రోల్ చేసేస్తారు.

అయితే నాచురల్ గా ఉన్న హీరోయిన్లు మరింత అందంగా కనిపించడానికి కొన్ని కొన్ని సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.

కానీ ఇటువంటి సర్జరీలు ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఇష్టపడరు.సర్జరీ చేయించుకోవడం వల్ల ఉన్న అందం కోల్పోతారన్న భయంతో వారికి సర్జరీ చేయించుకోవద్దు అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు.

తాజాగా అటువంటి సలహానే న్యాచురల్ బ్యూటీ శ్రీ లీలకు తమ అభిమాని ఇచ్చారు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి మనసులను దోచుకున్న బ్యూటీ శ్రీ లీల.అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి సక్సెస్ లతో బాగా దూసుకెళ్తుంది.

తొలిసారిగా 2019లో ముద్దు అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక అదే ఏడాది భరతే అనే కన్నడ సినిమాలో నటించింది.దీంతో కన్నడలో తనకు మంచి గుర్తింపు వచ్చింది.

2021 లో పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇక ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది.ముఖ్యంగా తన డాన్స్ తో బాగా అదరగొట్టింది.అలా తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.ఇక గత ఏడాది రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీ లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.ఆ సమయంలోనే ఆమె కన్నడలో కూడా రెండు సినిమాలతో ముందుకు వచ్చింది.దీంతో ధమాకా ఎఫెక్ట్ తో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే కనిపిస్తుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టా గ్రామ్ లో రెండు ఫోటోలు పంచుకుంది.

అయితే అందులో ఈ బ్యూటీ ఫేస్ లో ఒక మార్పు కనిపించింది.అదేంటంటే తన పై పెదవి పై కాస్త చిన్న మార్పు కనిపించింది.వెంటనే అది గమనించిన కొందరు పెదాలకు ఏమయ్యింది అంటూ ప్రశ్నిస్తున్నారు.ఓ నెటిజన్ కూడా.నీ పెదవులను ఏం చేశావమ్మాయి.ఒకరు నీ అందమైన పెదాలను పాడు చేశారు.

నువ్వు అప్పటికే మంచి పర్ఫెక్ట్ మరియు అందమైన అమ్మాయివి.దయచేసి ఎటువంటి సర్జరీలు చేసుకొని మమ్మల్ని బాధ పెట్టొద్దంటూ సలహా ఇచ్చారు.

ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube