వామ్మో.. వీళ్లు కొండ చిలువకే చుక్కలు చూపించి కుక్కను కాపాడారు..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరలవుతుంటాయి.అయితే, కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తుంటుంది.

 They Dared On The Python And Saved The Dog Details, Python, Viral Video, Saved Dog, Python, Anaconda, Three Children, Children Saved The Dog, Social Meida, Viral Video, Viral Animals Video-TeluguStop.com

ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.సదరు వీడియోలో ప్రమాదకరమైన కొండ చిలువ చేతిలో చిక్కుకుని దాదాపుగా దాని పని అయిపోయిందనుకునే స్థితిలో ఉన్న కుక్కను ఓ నలుగురు పిల్లలు శ్రమించి కాపాడారు.

ఈ క్రమంలో వారు కొండ చిలువకే చుక్కలు చూపించారని చెప్పొచ్చు.

 They Dared On The Python And Saved The Dog Details, Python, Viral Video, Saved Dog, Python, Anaconda, Three Children, Children Saved The Dog, Social Meida, Viral Video, Viral Animals Video-వామ్మో.. వీళ్లు కొండ చిలువకే చుక్కలు చూపించి కుక్కను కాపాడారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సదరు వైరల్ వీడియోలో మీరు చూసినట్లయితే కుక్క కొండ చిలువ ఎరలో చిక్కుకుని ఉంది.

ఇంకొద్ది సేపు అయితే కొండ చిలువ సజీవంగానే కుక్కను మింగే ప్రయత్నం చేసేది.అంతలోనే అక్కడికి ముగ్గురు నలుగురు పిల్లలు వచ్చారు.కుక్కను అమాంతంగా చుట్టేసిన కొండ చిలువను చూసి వారు కుక్కను కాపాడేందుకు పూనుకున్నారు.

ఈ క్రమంలోనే వారు.

కొండ చిలువ నోటికి అడ్డంగా ఓ కట్టెను పెట్టారు.మొత్తం ముగ్గురు పిల్లలు నిస్సహాయస్థితిలో ఉన్న కుక్కను కాపాడేందుకు సాహసమే చేశారు.

అలా చుట్టుకుని ఉన్న కొండ చిలువను అతి కష్టం మీద లాగారు.చివరకు కుక్కకు చుట్టుకుని ఉన్న కొండ చిలువను వాళ్లు బయటకు తీశారు.

కుక్క ఇక తన ప్రాణాలను తిరగి సంపాదించుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.యానిమల్ వరల్డ్ అనే ట్విట్టర్ యూజర్.ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేయగా, అది నెట్టింట ట్రెండవుతోంది.

ఈ వీడియో చూసి నెటిజన్లు సదరు కుక్కను కాపాడిన పిల్లలను అప్రిసియేట్ చేస్తున్నారు.చాలా కష్టపడి కుక్కను కొండ చిలువ చెర నుంచి కాపాడారని అంటున్నారు.

ఇకపోతే ఈ వీడియోను చూస్తున్నంతసేపు కొంత మేరకు భయం అయితే అయిందని ఇంకొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.పిల్లలు సాహసవీరులు మాత్రమే కాదు కుక్క పాలిట ప్రాణప్రదాతలు అని కొందరు చెప్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube