ఓడితేనే మారుతారు ! వైసీపీ ఓటమి కోరుకుంటున్న కార్యకర్తలు ?   

they change when defeated, ysrcp activists seek defeat, Jagan , YSRCP, TDP, ap, Chandrababu, tirupathi elections - Telugu Ap, Chandrababu, Dubbaka, Jagan, Kcr, Leaders, Lokesh, Tdp, Telangana, Tirupathi, Trs, Ysrcp

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.అధికార పార్టీ అంటూ గొప్పగా చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు.

TeluguStop.com - They Change By Defeat Ysrcp Activists Seeking Defeat

ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒక ఎత్తు అయితే , సొంత పార్టీ కార్యకర్తలలోనూ, నాయకులలోనూ పార్టీ వ్యవహారం పైన ,అధినేత జగన్ వ్యవహారశైలి పైన తీవ్రస్థాయిలో అసంతృప్తి పెరిగిపోయింది.పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ,  పార్టీని అధికారం వైపు తీసుకొచ్చేందుకు తమ వంతు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినా, ఆ ఫలితం తమకు దక్కకుండా చేస్తున్నారనే బాధ వైసీపీ నాయకుల్లో పెరిగిపోతోంది.

పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకులకు, కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా , పూర్తిగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూ, అధికారులతో వ్యవహారాలను చక్కబెడుతూ, పార్టీ నాయకులకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు అనే బాధ వైసిపి నాయకుల్లో క్షేత్రస్థాయి నుంచి వ్యక్తం అవుతోంది.

TeluguStop.com - ఓడితేనే మారుతారు వైసీపీ ఓటమి కోరుకుంటున్న కార్యకర్తలు  -Political-Telugu Tollywood Photo Image

ఎప్పటికప్పుడు పరిస్థితి చక్కబడుతుందని ఎదురు చూపులు చూస్తున్నా, ఆ ఫలితం కనిపించకపోవడంతో వారిలో పెరిగిపోతున్న ఆందోళన అంతా ఇంతా కాదు.

పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అందరిలోనూ ఒక రకమైన విసుగు కనిపిస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.

ఇక్కడ గెలిచి తీరాలి అనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.కానీ ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతేనే మంచిదనే అభిప్రాయం చాలామంది నాయకుల్లో వచ్చేసింది.

దీనికి కారణం పార్టీ ఇక్కడ ఒడితేనే జగన్ పూర్తి స్థాయిలో పార్టీ నాయకులను పట్టించుకుంటారు అని, తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కారణంగానే ఆగమేఘాల మీద సమీక్ష చేపట్టిన కెసిఆర్ పార్టీ నాయకులకు ప్రాధాన్యం కల్పించి , పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోటుపాట్లు అన్నింటి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు అనే విషయం ఇక్కడ వైసిపి నాయకులు హైలెట్ చేస్తున్నారు.జగన్ కు ఒక్క జలక్ తగిలితేనే పార్టీ ప్రభుత్వం ఒక గాడిన పడుతుంది అనే అభిప్రాయాన్ని మెజార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారట.

#Chandrababu #Ysrcp #Tirupathi #Jagan #Leaders

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు