అర్ధరాత్రి ఫోన్ చేసి కుటుంబాన్ని చంపేశాల ఉన్నారంటే.. వెంటనే శ్రీహరి ఆ పని చేశాడు?

రియల్‌ స్టార్‌, విలక్షణతకు పెట్టింది పేరైన శ్రీహరి, తనదైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించారు.మంచి మనిషిగా కూడా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు.

 They Call At Midnight And They Want To Kill The Family What Srihari Do,  Srihari-TeluguStop.com

పేదరికం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా తన సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఆదుకున్న ఆప్తుడుగా నిలిచిన మహానుభావుడు.జీవితం సాఫీగా పోతున్న సమయంలోనే తీవ్ర అనారోగ్యంతో 2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఇక రియల్ స్టార్ శ్రీహరి ఎంత దయా హృదయుడో ఆయన సహాయం చేసిన వారికే కాదు చాలా మందికి తెలుసు.కాగా ఆయన గొప్పతనాన్ని డైరెక్టర్ బాబీ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

ఇక పోతే ఒక సంఘటనను చెప్పాలంటే సాధారణంగా శ్రీహరి గారికి 2 మొబైల్స్ ఉంటాయి.ఒకటి పర్సనల్, మరొకటి పబ్లిక్.

పర్సనల్ నంబర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కాబట్టి నైట్ టైం ఆఫ్ చేస్తారు.పబ్లిక్ ది మాత్రం ఆన్ లో పెట్టి వైబ్రేషన్ లో పెట్టేవారు.

ఒకరోజు రాత్రి ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది .లిఫ్ట్ చేశారు.ఎవరో షిరిడీ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఆడపిల్లలు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు.” ఏయ్ ఏం రా ఎవరు నువ్వు సరిగ్గా చెప్పురా చెప్పుతో కొడతా రాస్కెల్ సరిగా చెప్పు” అని శ్రీహరి అన్నారని డైరెక్టర్ బాబీ చెప్పారు.అప్పుడు అవతలి వ్యక్తి ఇలా చెప్పాడు – బస్ లో ఎవరో ఒక ఐదుగురు మందు తాగి కూర్చున్నారు.అతని భార్యని, ఆడపిల్లలను కామెంట్ చేస్తుంటే కోపం వచ్చి తిట్టేసానని.

Telugu Bobby, Bobbyabourt, Phone, Srihari, Tollywood, Sri Hari-Movie

అప్పుడు వాళ్ళు అతనికి ఒక ఛాలెంజ్ చేశారట.బస్ లో చాలా మంది ఉన్నారు.హైదరాబాద్ లోని సనత్ నగర్ రాగానే నిన్ను కొడతామని వార్నింగ్ ఇచ్చారని.ఎవరిని చేయాలో తెలియక, ఎవరికో నంబర్ ఇస్తున్నప్పుడు దూరం నుంచి సేవ్ చేసుకొని గొప్పగా చూపించుకుంటున్న ఆ వ్యక్తి డైరెక్ట్ శ్రీహరి గారికి ఫోన్ చేసి సమస్యను చెప్పినట్టు ఆయన తెలిపారు.

దానికి శ్రీహరి, సర్లే అయితే ఇప్పుడు నువ్వు వాళ్ళతో గొడవ పడకు.దేవుడి దగ్గరికి వెల్లోస్తున్నావు సైలెంట్ గా ఉండు.హ్యాపీగా రా.మా వాళ్ళు వస్తారు అని చెప్పారని బాబీ వివరించారు.

Telugu Bobby, Bobbyabourt, Phone, Srihari, Tollywood, Sri Hari-Movie

తెల్లవారుజామున 5:30 కి బస్ SR నగర్ కి వచ్చింది.అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ శ్రీహరికి ఫోన్ చేశారు.అన్నా ఎవరైనా వచ్చారా అని.అంటే ఒక ఇండీవర్ కార్లో టీ షర్ట్ వేసుకొని, నిద్ర ముఖంతో, లుంగీ కట్టుకుని శ్రీహరి గారు SR నగర్ దగ్గర ఎదురు చూస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది ప్రపంచంలో ఎవరైనా కథగా రాస్తే ఎవరైనా నమ్ముతారా ? అంటూ డైరెక్టర్ బాబీ శ్రీహరి గురించి గొప్పగా చెప్పసాగారు.ఇదంతా కూడా తనకు శ్రీహరి గారు చెప్పలేదని స్వయానా ఆ ఫ్యామిలీనే కాళ్ళకు దండం పెట్టి ఏడుస్తున్నపుడు తాను అక్కడే ఉన్నానని ఆయన అన్నారు.

ఇలాంటివి శ్రీహరి గారి గురించి చెప్పాలంటే కొన్ని కోట్లు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

శ్రీహరి గారు లేకపోవడం ఆయన ఫ్యామిలీకి ఎంత లాసో తెలియదు గానీ, మా లాంటి జనరేషన్ కి, పబ్లిక్ కి అందరికీ చాలా పెద్ద లాస్ అని డైరెక్టర్ బాబీ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube