వాళ్లకి ఒక్కసారి వ్యాక్సిన్ చాలు, మిగతా వాళ్ళ మాదిరిగా కాదు..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ వల్ల ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థికంగా నష్ట పోవడమే కాక ప్రమాణాల పరంగా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

 Corona Virus,corona Vaccine,india,corona Anti Bodies,corona,corona Anibodies,ind-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఈ వైరస్ కి సంబంధించి వ్యాక్సిన్లు చాలా దేశాలలో అందుబాటులోకి రావడంతో మహమ్మారి భయం నుండి జనాలు చాలావరకూ కోలుకునే పరిస్థితి నెలకొంది.

ఇండియాలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం మాత్రమే కాక అన్ని దేశాల వ్యాక్సిన్లు కంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉండటం విశేషం.

పరిస్థితిలో ఉండగా కరోనా వైరస్ సోకి తర్వాత కోలుకున్న వ్యక్తికి ఒక్కసారి వ్యాక్సిన్ వేస్తే సరిపోతుందని తాజాగా పరిశోధకులు తెలియజేశారు.అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ లు చాలా వరకు వివిధ డోస్ లు వేసుకునే పరిస్థితి ఉండటంత ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో యాంటీబాడీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి వ్యక్తికి రెండు డోసులు అవసరం లేదని, ఎలాగో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక డోస్ సరిపోతుంది అని పేర్కొన్నారు.కానీ కరోనా సోకని వ్యక్తికి మాత్రం రెండు డోస్ ల వ్యాక్సిన్లు తప్పనిసరి అని తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube