ఒక డైరెక్టర్ సినిమా తీసినప్పుడు దానికి పబ్లిసిటీ చాలా అవసరం లేకపోతే ఆ సినిమాకి బిజినెస్ అనేది జరగదు.అలాంటప్పుడు సినిమాని రిలీజ్ చేసే టైంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందుకే ఒక సినిమాను తీయడం ఎంత ఇంపార్టెంటో దానికి పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్…
అయితే సినిమాని పబ్లిసిటీ చేయడంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) మొదటి స్థానంలో ఉంటారు.ఈయన తీసిన ప్రతి సినిమాకి ఈజీగా పబ్లిసిటీ అయిపోతుంది.అందుకే ఆయన ఏ సినిమా తీసినా కూడా దాన్ని ఎవరో ఒకరు కొని రిలీజ్ చేస్తూ ఉంటారు అలా ఆయన సినిమాకి మంచి మార్కెట్ ని ఏర్పాటు చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు.
ఇక ఈయన తర్వాత దర్శక ధీరుడు అయిన రాజమౌళి( Rajamouli ) కూడా సినిమాకి బిజినెస్ చేయడంలో ముందుంటాడు ఒక సినిమాకి ఎవరితో ప్రమోట్ చేయిస్తే ఆ సినిమా జనాల్లోకి బాగా వెళుతుంది.అనేది ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు.
అందుకే తన సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగానే డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ప్లాన్ చేసి ఆ సినిమా మీద ప్రజల్లో ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తారు.ఇంతకు ముందు ఆయన చేసిన బాహుబలి ( Baahubali )గాని, త్రిబుల్ ఆర్ గాని చూస్తే ఆ విషయం మనకిఅర్థం అవుతుంది.ఆయన మార్కెటింగ్ చేశాడు అంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తులో జరుగుతుంది.అందుకే రాజమౌళికి సినిమా ఎంత బాగా తీయాలో తెలుసు, అలాగే దానిని ఎంత బాగా మార్కెటింగ్ చేయాలో కూడా తెలుసు అందుకే ఆయన సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి.
ఆయన తీసిన ప్రతి సినిమాకి ఆయనే స్వయంగా మార్కెటింగ్ చేస్తాడు కాబట్టి అందుకే ఆయన సినిమాలకి కలక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయి…
.