చంపేస్తాం అంటూ నన్ను బెదిరిస్తున్నారు.. కేసు పెట్టిన కంగనా రనౌత్!

They Are Threatening To Kill Me Kangana Ranaut Filed The Case

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.

 They Are Threatening To Kill Me Kangana Ranaut Filed The Case-TeluguStop.com

ఈమె తనకు నచ్చిన విషయాలను ఏమాత్రం సంకోచించకుండా ముక్కు సూటిగా తన అభిప్రాయాలను పంచుకోవడంతో ఎన్నో వివాదాలకు కారణమవుతోంది.ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి పంజాబ్ రైతులు సాగు చట్టాల రద్దు కోసం పోరాటం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సాగు చట్టాల రద్దు గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఈ క్రమంలోనే ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎన్నో విమర్శలు వచ్చాయి.

 They Are Threatening To Kill Me Kangana Ranaut Filed The Case-చంపేస్తాం అంటూ నన్ను బెదిరిస్తున్నారు.. కేసు పెట్టిన కంగనా రనౌత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వాటిని పట్టించుకోకుండా మంచి జరగడం కోసం తన చివరి వరకు పోరాడుతానని తెలిపింది.ఇలా రైతుల సాగు చట్టాల రద్దు విషయంలో కంగనా చేస్తున్నటువంటి విమర్శల గురించి కొందరు వ్యక్తులు తనను తప్పుపట్టడమే కాకుండా తనని చంపేస్తామని బెదిరింపులు కూడా చేస్తున్నారని, అయినా నేను అలాంటి బెదిరింపులకు భయపడనని తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

Telugu Actress, Bollywood, Kangana, Kangana Ranauts, Complaint, Punjab, Punjab Farmers, Threats-Movie

ఈ విధంగా తనని చంపేస్తామని బెదిరించడంతో ఈ విషయంపై కంగనా రనౌత్ పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పంజాబ్ కి చెందిన ఒక వ్యక్తి తనని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఈమె ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఇక ఈ బెదిరింపులకు సంబంధించిన వివరాలను కూడా ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.ఇలా కంగనా రనౌత్ ఏదో ఒక విషయం ద్వారా నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

#Kangana #Punjab #Kangana Ranauts #Punjab #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube