నా మార్కెట్ పెరగడానికి కారణం వాళ్లే... అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు.అల్లు వారసుడిగా, మెగా మేనల్లుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు.

 They Are The Reason For My Market To Grow Allu Arjun, Actor Allu Arjun, Pushpa M-TeluguStop.com

అయితే వారసులకు సినిమా ఎంట్రీ సులభమే కాని నటుడుగా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాలి.అల్లు వారసుడు అని ప్రేక్షకులలో పేరు మర్చిపోయి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు అల్లుఅర్జున్.

ఇక తనదైన స్టైలిష్ లుక్ తో డాన్స్ లో ఉన్న గ్రేస్ కు అభిమానులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు.అయితే అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ వైపు తిరిగింది.

ఎవరీ కుర్రాడు అనేంతలా డ్యాన్స్ లతో మెస్మరైజ్ చేసాడు.ఇక అప్పటి నుండి వరుస సినిమాలతో ఇక స్టార్ హీరోగా మారిన అల్లు అర్జున్ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

ఇక తెలుగు రాష్ట్రాలే కాక, కన్నడ, తమిళం, మలయాళ భాషలో ఆశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.ఇక తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు.

అయితే తాజాగా టీజర్ విడుదల సమయంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్.తెలుగు అభిమానులే కాక, తమిళం, మలయాళం, కన్నడ అభిమానులు మీరు లేకపోతే తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోయేది కాదు అని అల్లుఅర్జున్ అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube