దేశంలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నది వాళ్లేనట..!!

దేశంలో వైరస్ ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.లక్షల లో గత కొద్ది వారాల నుండి కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

 They Are The Most Affected Corona In The Country,  India,  Corona Virus , Yonger-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొత్తగా నమోదు అవుతున్న కేసుల విషయంలో మొదటి స్థానంలో ఉన్న అమెరికా దేశానికి పోటీల్లో భారత్ లో పరిస్థితి వుంది.ఇదిలా ఉంటే దేశంలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్న వాళ్ళు యువకులే అని లెక్కలు చెబుతున్నాయి.

ఇందువల్లే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ విషయంలో వయసును పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాయి అట.

అయితే యువకులు ఎక్కువగా కరోనా బారిన పడటానికి గల కారణం మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు పాటించక పోవడం వల్లే వైరస్ సోకుతుంది అన్నట్లు వైద్యులు మరియు ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.బహిరంగ ప్రదేశాలలో మరియు వివాహ మరియు ఇతర కార్యక్రమాలలో కూడా కరోనా నిబంధనలు పాటించకుండా ఉండటం కూడా ఒక కారణమని వైద్య నిపుణులు హెచ్చరించారు.ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత ఉద్రిక్తం అయితే యువత బాగానే ఉన్నా వారి వల్ల ఇంటిలో ఉండే పెద్ద వాళ్లకు ప్రమాదం చేకూరే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా ఇంటి నుండి బయటకు వెళ్లే యువత కరోనా నిబంధనలు పాటిస్తూ బతికితే ఇంటిలో వారికి మేలు చేయడం మాత్రమే గాక కరోనా వ్యాప్తిని అరికట్టిన వారవుతారని ప్రభుత్వాలు మరియు వైద్యులు కోరుకుంటున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube