నా ఎమోషనల్ సపోర్ట్ వాళ్లే.. దుల్కర్ కామెంట్స్ వైరల్!

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్.ఈయన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.

 They Are My Emotional Support Dulquer Comments Viral Details, Dulquer Salman,sitaram,hanu Raghavapudi,tollywood, Dulquer Salman Interview, Heroine Mrunal Thakur, Dulquer Salman Emotional Comments, Dulquer Salman Father , Mammooty-TeluguStop.com

అయితే తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాతో ఈయన మరో మంచి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 They Are My Emotional Support Dulquer Comments Viral Details, Dulquer Salman,Sitaram,Hanu Raghavapudi,tollywood, Dulquer Salman Interview, Heroine Mrunal Thakur, Dulquer Salman Emotional Comments, Dulquer Salman Father , Mammooty-నా ఎమోషనల్ సపోర్ట్ వాళ్లే.. దుల్కర్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తాను కూడా అందరిలాగే ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా దుల్కర్ వెల్లడించారు.

ఇక నాన్న సూపర్ స్టార్ కావడంతో నాపై మరిన్ని బాధ్యతలు కూడా ఉన్నాయని ఈయన తెలిపారు.ఇక ఏ విషయంలోనైనా నాకు నా కుటుంబం నా స్నేహితులు ఒక ఎమోషనల్ సపోర్ట్ అని కొద్దిగా నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిన వెంటనే నన్ను గుర్తించి ఏం జరిగింది అంటూ ఆరా తీస్తారని, ఈ విషయంలో తాను ఎంతో అదృష్టవంతుడిను అంటూ దుల్కర్ వెల్లడించారు.

Telugu Dulquer Salman, Dulquersalman, Mrunal Thakur, Mammooty, Sitaram, Tollywood-Movie

ఇకపోతే తన సినిమాలు నాన్న చూసినప్పటికీ ఆయన సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మాత్రం చెప్పరని,ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఆయన ముందు నేను కూర్చుని తన ఫేస్ లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆ సినిమా ఆయనను ఏ విధంగా ఆకట్టుకుంది తనకు ఎలా నచ్చిందనే విషయాలను గుర్తిస్తానని అలా ఆయన మొహంలో కనిపించే చిరునవ్వు, ఆయన కొట్టే చెప్పట్లే నా సినిమాకు కాంప్లిమెంట్స్ అంటూ దుల్కర్ సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube