రాజమౌళి పరువు తీస్తున్నారు

రాజమౌళి దర్శకత్వపటిమ మీద మనకేమైనా సందేహాలు ఉంటాయా ? ఉంటె మనంత పిచ్చోళ్ళు మరొకరు ఉండరేమో.అసలు అపజయమే ఎరుగని దర్శకధీరుడు ఆయన.

 They Are Defaming Rajamouli-TeluguStop.com

బ్లాక్బస్టర్ కి తగ్గి ఏ ఒక్క సినిమా చేయలేదు.మరి అలాంటి గురువు దగ్గర శిష్యరికం చేసినవాళ్ళు ఎలా ఉండాలి ? ఆయనంత కాకపోయినా, ఆయన ప్రభావం కాస్తైనా ఉండాలి కదా.కాని ఆయన శిష్యులు ఆయన పరువు తీస్తున్నారు.

2009లో వచ్చిన తెలుగు సినిమా ద్రోణ గుర్తుందా ? నితిన్ – ప్రియమణి నటించారు.ఆ చిత్ర దర్శకుడు జే.కరుణ్ కుమార్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.ఆ సినిమా ఆడలేదు.2011లో వచ్చిన ఆడు మగడ్రా బుజ్జి గుర్తుందా ? సుధీర్ బాబు హీరో.ఆ చిత్ర దర్శకుడు కృష్ణ రెడ్డి రాజమౌళి శిష్యుడు.ఈ సినిమా కూడా ఆడలేదు సరికదా ప్రేమకథ చిత్రం లాంటి బ్లాక్బస్టర్ తరువాత సుధీర్ కెరీర్ ను వెనక్కి నెట్టింది.

నాగశౌర్యతో దిక్కులు చూడకు రామయ్య తీసిన త్రికోటి కూడా రాజమౌళి శిష్యుడే, ఆ సినిమా కూడా ఫ్లాపే.ఇక తాజాగా లచ్చిందేవికి ఓ లేక్కుంది.

ఈ సినిమా దర్శకుడు జగదీశ్ తలసిలా కూడా రాజమౌళి శిష్యుడే కావడం విశేషం.అంతకన్నా విశేషం ఏంటంటే, ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడం.

గురువేమో దేశమంతా ఆశ్చర్యపోయే రేంజ్ సినిమాలు తీస్తోంటే, ఆయన శిష్యులు మాత్రం అపజయాలు వెనకేసుకుంటూ ఆయన పరువు తీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube