వీళ్లందరూ స్టార్ హీరోలే కానీ.. ఇక్కడ మాత్రం విలన్స్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలో స్టార్ హీరోలతో పోటీ పడటం కోసం ఇతర భాషలలోని స్టార్ హీరోలను ఇక్కడ విలన్లుగా పరిచయం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

 They Are All Star Heroes Doing Villain Roles In Tollywood Details, Villains, He-TeluguStop.com

ఇలా పరభాష హీరోలను తెలుగులో విలన్ గా పరిచయం చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఇక పరభాషా హీరోలు సైతం వారికి నచ్చిన భాషలో హీరోలుగా చేస్తూ ఇక్కడ విలన్లుగా నటిస్తూ రెండు చేతులా బాగా సంపాదిస్తున్నారు.

అయితే ఇతర భాషలలో స్టార్ హీరోలుగా ఉన్న వారు ఇక్కడ విలన్లుగా స్థిరపడిన హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే…

ఉప్పెన సినిమా ద్వారా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతికి ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్నారు.

అదేవిధంగా కన్నడనాట స్టార్ ర్ హీరోగా ఉన్నటువంటి సుదీప్ ఈగ సినిమా ద్వారా విలన్ గా మారారు.అలాగే మరొక యాక్షన్ హీరో దునియా విజయ్ బాలకృష్ణ గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమాలో విలన్ గా బాలకృష్ణతో పోటీ పడబోతున్నారు.

Telugu Aarya, Duniya Vijay, Fahadh Faasil, Heroes, Ravi Kishan, Sudeep, Tollywoo

అదే విధంగా తమిళంలో స్టార్ హీరో అయిన ఆర్య అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించారు.తాజాగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో సందడి చేశారు.ఇక భోజ్ పురిలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నా రవి కిషన్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం చిత్రం ద్వారా విలన్ గా మారిపోయారు.ఇలా పరభాషలో స్టార్ హీరోలుగా కొనసాగిన వీరందరూ తెలుగులో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషమైన తెలుగు ప్రేక్షకాదరణ దక్కించుకున్నారని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube