ఆదర్శం : రూ. 3 లతో మొదలు పెట్టి రూ. 30 వేల కోట్లకు, నమ్మకంతో కష్టపడితే ఏదైనా సాధ్యం  

The Story Of Karsanbhai Patel - Telugu Gujarath State, India Surf, Karsanbhai Patel, Success Story Of The Great Karsanbhai Patel Founder Of Nirma, Washing Founder Maker

సాదించాలనే పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోదాలు వచ్చినా ఆగకుండా ముందుకు సాగితే విజయం అనేది ఖచ్చితంగా వరిస్తుంది అనేందుకు ఇప్పటి వరకు మీకు చాలా మంది వ్యక్తుల గురించి ఉదాహరణగా చెప్పడం జరిగింది.ఇప్పటి వరకు మీకు పరిచయం చేసిన లెజెండ్స్‌ వారి వారి రంగాల్లో వెనుక ప్రోత్సాహం లేదంటే ఎవరి సాయం అయినా తమ లక్ష్యాలను ఛేదించారు.

The Story Of Karsanbhai Patel

కాని ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి.అలాంటి వ్యక్తి జీవితంలో సాధించిన విజయం ఒక అద్బుతంగా చెప్పుకోవచ్చు.

  ఇంతకు అతను ఎవరంటే నిర్మా వాషింగ్‌ పౌడర్‌ సృష్టి కర్త కేకే పటేల్‌.ఈయన గురించి ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో అనేక మీడియా సంస్థలు రాయడం జరిగింది.గొప్పొల్ల గురించి ఎంత రాసినా, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.అందుకే మరోసారి ఆయన గురించి తెలియని వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని చెప్పేందుకు వచ్చాను.

ఆదర్శం : రూ. 3 లతో మొదలు పెట్టి రూ. 30 వేల కోట్లకు, నమ్మకంతో కష్టపడితే ఏదైనా సాధ్యం-General-Telugu-Telugu Tollywood Photo Image

గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదువుతుంటే సాధించాలనే కసి పెరుగుతుంది.అందుకే ఇది ఖచ్చితంగా మీలో ఆ కసిని కలిగించి ముందుకు తీసుకు వెళ్తుందని ఆశిస్తున్నాను.

  ఇక కేకే పటేల్‌ గారి గురించి వివరాల్లోకి వెళ్తే.గుజరాత్‌ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో సాదారణ కుటుంబంలో జన్మించాడు.అప్పట్లో పెద్దగా చదువుకున్న వారు లేరు.కాని కేకే పటేల్‌ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశాడు.ఆ సమయంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనే కోరిక కలిగింది.ఏ వ్యాపారం అయితే బాగుంటుందా అని చాలా ఆలోచించాడు.

ఇండియాలో అప్పటి వరకు సర్ఫ్‌ తయారీ లేదు.అందుకే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

మొదట తన ఇంటి పెరటిలోనే సర్ఫ్‌ తయారీ మొదలు పెట్టాడు.

  మొదట్లో ప్రతి రోజు 10 నుండి 15 కేజీల వరకు సర్ఫ్‌ను తయారు చేయడం జరిగింది.రాత్రి సమయంలో తయారీ, ఉదయం సమయంలో తానే స్వయంగా తిరుగుతూ అమ్మే వాడు.అలా కొన్ని నెలలు సర్ఫ్‌ వ్యాపారం చేసి కాస్త సంపాదించాడు.

ఆ మొత్తంతో కంపెనీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.అందుకోసం కొంత మొత్తం బ్యాంకు నుండి కూడా రుణం పొందాడు.

కంపెనీ అయితే పెట్టాడు.కొద్ది మొత్తంలో కాబట్టి తానే వెళ్లి అమ్మాడు.

కాని ఇప్పుడు సపోర్టింగ్‌ స్టాప్‌ కావాలి.అయితే ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో తెలియదు.

కాని నమ్మకంతో ఖర్చు పెడుతూ పోయాడు.సంపాదించింది మాత్రమే కాకుండా ఇంకా చాలా బయట నుండి తెచ్చి పెట్టాడు.

విదేశాల నుండి వస్తున్న సర్ఫ్‌ను 15 నుండి 20 రూపాయలకు అమ్ముతుంటే పటేల్‌ మాత్రం తన నిర్మా సర్ఫ్‌ను 5 రూపాయలకు అమ్మేవాడు.దానికి తోడు క్వాలిటీ కూడా చాలా బాగుండేది.

కేవలం సంవత్సరం కాలంలోనే నిర్మా సర్ఫ్‌ దేశం అంతా పాకింది.టీవీల్లో అప్పట్లో వచ్చిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మా ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందో నిర్మా సర్ఫ్‌ కూడా అంతకు మించి సక్సెస్‌ అయ్యింది.

వేల కోట్ల దిశగా బిజినెస్‌ సాగింది.సర్ఫ్‌ మాత్రమే కాకుండా సబ్బు ఇంకా పలు రంగాల్లోకి కూడా పటేల్‌ విస్తరించాడు.బిఎస్సీ కెమిస్ట్రీ చేసిన సమయంలో ఆయనకు చాలా జాబ్‌ ఆఫర్లు వచ్చాయి.10 వేల రూపాయల జాబ్‌ను వదిలేసి నెలకు నాలుగు అయిదు వేలు వచ్చిన బిజినెస్‌ చేశాడు.తనపై తనకు నమ్మకం ఉండటం వల్లే నిర్మాను ఈ స్థాయికి తీసుకు వెళ్లగలిగాడు.అందుకే మనపై మనం నమ్మకం పెట్టుకుంటే ఇతరులు కూడా మనని నమ్ముతారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Story Of Karsanbhai Patel-india Surf,karsanbhai Patel,success Story Of The Great Karsanbhai Patel Founder Of Nirma,washing Founder Maker Related....