2018 ఉగాది నుండి ఈ రెండు రాశుల వారికీ వద్దన్న డబ్బే     2018-03-07   23:02:48  IST  Lakshmi P

ఉగాది అంటే తెలుగువారికి ఇష్టమైన పండుగ. ఆ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ రోజున తప్పనిసరిగా ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తాం. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానము చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి కొత్త బట్టలు వేసుకొని సంవత్సరం అంతా ఉగాది పచ్చడిలానే అన్ని రుచులతో కమ్మగా ఉండేటట్టు చూడమని ఆ దేవుడిని వేడుకుంటాం. ఉగాది రోజు తమ రాశికి ఆదాయ వ్యయాలు,అవమానం,రాజ పూజ్యం ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉంటారు. అయితే 2018 ఈ ఉగాదికి రెండు రాశుల వారికి బాగా కలిసివచ్చి అదృష్టం తన్నుకువస్తుందట. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

తుల రాశి ,సింహ రాశి.ఈ రాశులవారికి ఉగాది తర్వాత అద్భుతమైన ఫలితాలు రావటమే కాకుండా అదృష్టం కూడా తోడు కానున్నది. వీరికి నవగ్రహ శాంతి చాలా అవసరం. అందువల్ల నవగ్రహ స్త్రోత్రం చదవాలి. ఈ రాశుల వారికీ ఎంత ఆదాయం వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. వీరి ఖర్చులను అదుపులో పెట్టాలంటే నవగ్రహ శాంతి తప్పనిసరిగా ఉండాలి.

వీరు సోమవారం శివాలయానికి వెళ్లి పూజ చేయాలి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే వీరికి ఎన్ని ఆటంకాలు ఎదురు అయినా చేసే పనిలో విజయం లభిస్తుంది. అలాగే చేతిలో ఎప్పుడు డబ్బు పుష్కలంగా ఉంటుంది. వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు.

ఏది ఏమైనా ఉగాది తర్వాత నుంచి ఈ రెండు రాశుల వారికి బాగా అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది.