ఈ రాశుల వారికి కష్టాలు ఎక్కువా... ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి  

These Zodiac Signs Facing More Problems-

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకం చూపించుకొని దాని ప్రకారం నడుచుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రతి మనిషి పుట్టిన నక్షత్రం,రాశిని బట్టి జాతకం చెప్పుతూ ఉంటారు. కొంతమందికి మంచి ఫలితాలు రావచ్చు.కొంతమందికి కొంచెం నిరాశను కూడా కలిగించవచ్చు. శని రాశులకు అనుగుణంగా ఉంటే చాలా మంచి చేస్తాడు. అదే వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం విపరీతమైన చెడు కలుగుతుంది. ఈ శని ప్రభావము మూడు రాశులపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అందువల్ల మొత్తం 12 రాశుల్లో ఈ మూడు రాశుల వారికీ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రాశులు ఏమిటో ఆ కష్టాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

మిధున రాశి

ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభించినప్పుడు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతుంది. శని ప్రభావంతో ఏ పని ముందుకు వెళ్ళదు. ఏ పని చేసిన శని అడ్డం పడుతూ ఉంటాడు. ఆర్ధికంగా కూడా స్థిరత్వం ఉండదు. కొంతమందికి అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అంతేకాకుండా మిధున రాశి వారు ఎట్టిపరిస్థితిలోను సహనం కోల్పోకూడదు.

These Zodiac Signs Facing More Problems-

These Zodiac Signs Facing More Problems

కర్కాటక రాశి

ఈ సంవత్సరం కర్కాటక రాశివారికి శని ఏడోవ స్థానంలో ఉంటాడు. ప్రతి క్షణం ఈ రాశివారిని శని వెంటాడుతు వేధిస్తూ ఉంటాడు. మీరు చేసే ప్రతి పనిలో అవరోధాలను,అడ్డంకులను సృష్టిస్తూ ఉంటాడు. మీకు ఏదొక సమస్య వస్తూనే ఉంటుంది. మీరు ఒక క్షణం కూడా సంతోషంగా ఉండలేరు.అందువల్ల మీరు కొన్ని రోజుల పాటు ఆందోళన పడకుండా ఓపికగా ఉండాలి.

These Zodiac Signs Facing More Problems-

ధనస్సు రాశి

మిధున రాశి,కర్కాటక రాశి వారితో పోలిస్తే ధనస్సు రాశి వారికీ శని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ రాశిలో బృహస్పతి ఉండటం వలన శని ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురయినా మొత్తం మీద పనిని కంప్లీట్ చేయగలుగుతారు.

These Zodiac Signs Facing More Problems-

ఈ మూడు రాశుల వారు కాలభైరవ అష్టకాన్ని ప్రతి రోజు 11 సార్లు పఠించాలి. ఇలా మూడు నెలల వరకు చేస్తూ ఉండాలి.