చ‌లికాలంలో ఈ కూర‌గాయ‌లు ఖ‌చ్చితంగా తినాల‌ట‌..తెలుసా?

These Vegetables Definitely Eat In Winter Season

చ‌లి కాలంలో స్టార్ట్ అవుతోంది.ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వాతావ‌ర‌ణం మార్పుల వ‌ల్ల అంద‌రిలోనూ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డిపోతుంది.

 These Vegetables Definitely Eat In Winter Season-TeluguStop.com

దాంతో వైరల్ ఫీవర్లు, చ‌ర్మ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు చాలా అధికంగా వేధిస్తుంటాయి.వాటి నుంచి త‌ప్పించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే త‌ప్ప‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా డైట్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే కూర‌గాయ‌ల‌ను ఖ‌చ్చితంగా చేర్చుకోవాల్సి ఉంటుంది.మ‌రి ఆ కూర‌గాయ‌లు ఏంటీ.? వాటిని ఎందుకు తీసుకోవాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 These Vegetables Definitely Eat In Winter Season-చ‌లికాలంలో ఈ కూర‌గాయ‌లు ఖ‌చ్చితంగా తినాల‌ట‌..తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముల్లంగి.చ‌లికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో ఇవి ఒక‌టి.చ‌లి కాలంలో త‌ర‌చూ ముల్లంగిని తీసుకుంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరిగి.అంటు వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

బ‌రువు అవుపులో ఉంటుంది.మ‌రియు చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

<

క్యారెట్‌, బీట్‌రూట్‌.చ‌లికాలంలో ఈ రెండిటినీ త‌ప్ప‌ని స‌రిగా తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వులు దరిచేరవు.గుండెకు రక్త సరఫరాను పెరుగుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బలోపేతం అవుతుంది.మ‌రియు శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌క విలువ‌లు సైతం అవుతాయి.

అలాగే చ‌లికాలంలో పాల కూర, బ్రోకోలి, క్యాబేజీ, గుమ్మడి కాయ, చిల‌క‌డ దుంప‌లు, బంగాళా దుంపలు, సొర కాయలు, టమాటలు వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.వీటిలో యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.అవి రోగ నిరోధక శక్తిని పెంచి.

సీజ‌న్ వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.

ఇక ఈ కూర‌గాయాలే కాదు నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి పండ్లూ, జీడి పప్పు, బాదం పప్పు, పిస్తా ప‌ప్పు వంటి నట్సూ, బఠానీలు, కోడిగుడ్లు, పెరుగు, పప్పు ధాన్యాలు వంటివి సైతం ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక వ్యాధుల‌కు దూరంగా, హెల్తీగా ఉండొచ్చు.

#Season #Vegetables #Tips #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube