మరణించిన ఈ ఇద్దరు సిస్టర్స్ మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు.. సైన్స్‌కే అంతుచిక్కని అద్భుతం అంటే ఇదే..!

These Two Sisters Who Died Were Born Again In The Womb Of The Same Mother This Is The Elusive Miracle Of Science

మానవుడికి అసలు పునర్జన్మ అనేది ఉంటుందా? ఎవరైనా చనిపోయి మళ్ళీ మానవుడిగా పుట్టి తమ గత జన్మ గురించి తెలుసుకోగలిగారా? ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు అనేవి ఉండవు.పునర్జన్మ అనేది ఒక మూఢ నమ్మకం అని కొట్టిపారేసేవారు కూడా ఉంటారు.

 These Two Sisters Who Died Were Born Again In The Womb Of The Same Mother This Is The Elusive Miracle Of Science-TeluguStop.com

కానీ కొన్ని ఘటన గురించి తెలుసుకుంటే పునర్జన్మ అనేది నిజమేనని ఒప్పుకోక తప్పదు.అలాంటి ఓ అబ్బురపరిచే ఘటన గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

అమెరికాకి చెందిన ‘పొల్లాక్‌ సిస్టర్స్’ కథ ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంటుంది.ఇది సైన్స్‌కే అంతుచిక్కని ఓ అంశంగా మిగిలిపోయిందంటే అతిశయోక్తి కాదు.

 These Two Sisters Who Died Were Born Again In The Womb Of The Same Mother This Is The Elusive Miracle Of Science-మరణించిన ఈ ఇద్దరు సిస్టర్స్ మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు.. సైన్స్‌కే అంతుచిక్కని అద్భుతం అంటే ఇదే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.అమెరికాకు చెందిన జొవాన్నా పొల్లాక్‌, జాక్వెలిన్‌ పొల్లాక్‌ అనే అక్కాచెల్లెళ్లు 1957లో ఓ కారు యాక్సిడెంట్‌లో మరణించారు.7 ఏళ్ల తర్వాత 1964లో ఈ అక్కాచెల్లెళ్లు మళ్ళీ జన్మించారు.గమ్మత్తేమిటంటే, కవల పిల్లలుగా పుట్టిన అక్కాచెల్లెళ్లు మళ్లీ తమ మొదటి తల్లి కడుపునే పుట్టారు.

మాట్లాడగలిగేంత పెద్ద అయిన తర్వాత ఈ అక్కాచెల్లెళ్లు తమ గత జన్మ గురించి అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు.దాంతో తల్లిదండ్రులతో సహా వీరి కథ గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

మొదటి పుట్టకలో ఈ అక్కాచెల్లెళ్లు ఫ్లోరెన్స్‌ అనే ఒక యువతికి జన్మించారు.వీరికి జొవాన్నా(11), జాక్వెలిన్‌(6)గా నామకరణం చేశారు.

ఐతే వారు ఒక చర్చి రోడ్డులో నడుస్తున్నప్పుడు ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది.ఆ దుర్ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

ఈ ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత అంటే 1964లో జొవాన్నా, జాక్వెలిన్‌ తల్లి ఫ్లోరెన్స్‌ మళ్లీ తల్లి అయింది.ఈసారి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

దాంతో జరిగిపోయిన విషాదం నుంచి తేరుకొని తమ పిల్లలతో సంతోషంగా తన జీవితాన్ని మొదలుపెట్టింది ఫ్లోరెన్స్‌.అయితే ఊహ వచ్చిన సమయం నుంచి ఆ ఇద్దరు కవల పిల్లలు చాలా వింతగా ప్రవర్తించేవారు.

Telugu Latest, Mothers, Twins Born-Latest News - Telugu

ఫ్లోరెన్స్‌ తన కవల పిల్లలకు గిల్లియన్, జెన్నిఫర్‌ అని పేరు పెట్టింది.ఒకరోజు తన తల్లి వద్దకు వచ్చి ఈ ఇద్దరు కవల పిల్లలు అటకపైన దాచిన బొమ్మలు ఇవ్వాలని అడిగారట.అసలు ఆ అటకపైన బొమ్మలు ఉన్నాయనే విషయం తన పిల్లలకు ఎలా తెలిసిందో అంతు చిక్కక ఫ్లోరెన్స్ కంగారుపడింది.చాలా ఏళ్ల క్రితం దాచిన బొమ్మలు గురించి తన పిల్లలకి ఎలా తెలిసిందో ఏమో అని ఆలోచిస్తూనే ఆ బొమ్మలు తీసి పిల్లలకు ఇచ్చింది.

అయితే “ఇవి నా బొమ్మలు.ఇవి నీ బొమ్మలు” అని ఆ కవల పిల్లలు పంచుకోవడం చూసి ఆమె మరింత షాక్ అయింది.

ఒక రోజు చనిపోయిన అక్కాచెల్లెళ్ల ఫొటోలు చూసి ఆ కవల పిల్లలు చాలా చిత్రంగా ప్రవర్తించారు.“చెల్లి ఇది నువ్వు.ఇది నేను” అని ఫొటో చూపిస్తూ గిల్లియన్ జెన్నిఫర్‌తో చెప్పడం కళ్లారా చూసి ఫ్లోరెన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.ఇలా తన కవల పిల్లలు ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియక ఆమె సతమతమవుతున్న సమయంలోనే మరొక షాక్ ఎదురైంది.

అదే గిల్లియన్, జెన్నిఫర్‌ తమ పాఠశాలను, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని గుర్తించడం! ఈ ఒక్క ఘటనతో చనిపోయిన తమ పిల్లలు మళ్లీ తన కడుపున కవల పిల్లలుగా పుట్టారని ఫ్లోరెన్స్ ఒక నిర్ధారణకు వచ్చింది.అయితే వీరిద్దరూ పుట్టిన 7 ఏళ్ల తర్వాత గతజన్మ స్మృతులని మర్చిపోయారట.

సాధారణ పిల్లల్లాగానే వీరి ప్రవర్తన మారిపోవడంతో తల్లిదండ్రులు కలవరపడడం లేదు.కానీ ఈ విషయం గురించి చాలామందికి చెప్తుంటారు.

ఇదంతా ఒక కట్టుకథ అని కొందరంటే.మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం పునర్జన్మలు ఉన్నాయని.

పొల్లాక్‌ సిస్టర్స్‌ కథ కట్టుకథ కాదని ఘంటా పథంగా చెబుతున్నారు.ఏదైనప్పటికీ పొల్లాక్‌ సిస్టర్స్‌ కథ సైన్స్‌కే చిక్కని ఒక అద్భుతం అని పలువురు అభిప్రాయపడుతుంటారు.

#Mothers #Twins Born

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube