మ‌న శ‌రీరంలోని ఈ రెండు అవ‌య‌వాలు జీవితాంతం పెరుగుతాయి?.. అవేమిటో తెలుసా?

వయసు పెరిగే కొద్దీ మన ముక్కు, చెవులు పెద్దవిగా కనిపిస్తాయి.ఈ రెండు అవయవాలు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటాయి.

 These Two Organs In The Body Grow Throughout Life Human Body Ears Nose Doctors S-TeluguStop.com

మిగిలిన అవయవాలు పరిమితికి మించి పెరగవు.దీని వెనుక శాస్త్రీయ వాస్తవం కూడా ఉంది.

గురుత్వాకర్షణ శక్తి కారణంగా, మన చెవులు, ముక్కు నిరంతరం పెరుగుతాయి.మన ముక్కు, చెవులు మృదులాస్థితో తయార‌వుతాయి.

మృదులాస్థిలో పెరుగుదల ఉండ‌ద‌నేది నిజం.మృదులాస్థి అనేది కొల్లాజెన్, ఇతర ఫైలర్లతో తయారైందని సైన్స్ చెబుతుంది, ఇవి వయస్సుతో పాటు బలహీనపడతాయి.

జర్మన్ వెబ్‌సైట్ డ్యుయిష్ వెల్లే నివేదిక ప్రకారం, మృదులాస్థి కొల్లాజెన్, ఫైబర్‌లతో రూపొందుతుంది.

గురుత్వాకర్షణ శక్తి కారణంగా, మన ముక్కు , చెవులు కిందకు వంగి ఉంటాయి.

వాటి ఆకారం మారుతూ ఉంటుంది.మన ముక్కు మరియు చెవులు నిరంతరం పెరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది.

మన ముక్కు మరియు చెవులు పెరుగుతూనే ఉంటాయని చాలామంది నమ్ముతారు.మ‌న ముక్కు, చెవుల మృదులాస్థి వయస్సుతో పాటు సాగుతుంది.

ఇలాంటి పరిస్థితి మన పెదవులు మరియు బుగ్గలతో కూడా జరుగుతుంది.వయసు పెరిగే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి వల్ల చర్మం వదులై కిందకు జారుతుంది.

దీని వల్ల ఈ అవయవాలలో పెరుగుదల ఉన్న‌ట్లు కనిపిస్తుంది.కానీ ఇది నిజం కాదు.ప్రతి సంవత్సరం మన చెవులు వాటి అసలు పరిమాణం క‌న్నా ఒక మిల్లీమీట‌రులో ఐదవ వంతు వరకు విస్తరిస్తుంది.ఈ పెరుగుదల చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ప్ర‌తీయేటా పెరుగుతూనే ఉంటుంది.

మన ముక్కు విషయంలో కూడా ఇదే జరుగుతుంది.అలాగే వయసు పెరిగే కొద్దీ మన ముఖం రూపురేఖ‌లు కూడా మారుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube