మంత్రివర్గంలో చోటు కోసం వీరంతా కర్చీఫ్ వేసేస్తున్నారా ...?  

 • తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు చూస్తున్న ఎదురుచూపులు అంతా ఇంతా కాదు. అసలు పార్టీ అధికారం లోకి వచ్చి నెలలు గడుస్తున్నా…. కేసీఆర్ నాన్చుడు ధోరణి వీరికి మింగుడుపడంలేదు. ఇప్పటికే అనేక తేదీలు మారినా… ఏ తేదిమీద క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పుడు ఫిబ్రవరి పదో తేదీ ఫైనల్ కాబోతోంది అనేది క్లారిటీ వచ్చింది. ఆదివారం వసంత పంచమి కావడం, శుభగడియలు కూడా ఉండడంతో ఆ రోజునే మంత్రి వర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తిచేశారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 20 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది.

 • These TRS MLA Wants Minister Place In Telangana Cabinet-Kcr Ktr Mahakutami Telangana Cabinet Politics Trs Trs Mlas

  These TRS MLA Wants Minister Place In Telangana Cabinet

 • లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్న కేసీఆర్‌ ఆ ఎన్నికల్లో పార్టీని సమన్వయం చేయడానికి వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అంతా భావిస్తున్నట్టు 10 వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరగకపోతే …ఈ నెల 24వ తేదీన ఖచ్చితంగా విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎవరెవరికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుంది అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఆశావాహులు మాత్రం ఎక్కువసంఖ్యలోనే ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే….

 • These TRS MLA Wants Minister Place In Telangana Cabinet-Kcr Ktr Mahakutami Telangana Cabinet Politics Trs Trs Mlas
 • రంగారెడ్డి: అరికెపూడి గాంధీ , మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌గౌడ్,

 • హైదరాబాద్‌: దానం నాగేందర్‌ , తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్

 • మహబూబ్‌నగర్‌: సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పి.నరేందర్‌రెడ్డి

 • ఆదిలాబాద్‌: జోగు రామన్న, అజ్మీరా రేఖానాయక్, కోనేరు కోనప్ప

 • నిజామాబాద్‌: వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆకుల లలిత , బాజిరెడ్డి గోవర్ధన్

 • కరీంనగర్‌: ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌

 • వరంగల్‌: ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి,డి.ఎస్‌.రెడ్యానాయక్‌ , అరూరి రమేశ్

 • ఖమ్మం: పువ్వాడ అజయ్‌కుమార్‌ , పల్లా రాజేశ్వర్‌రెడ్డి

 • మెదక్‌: తన్నీరు హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి , సోలిపేట రామలింగారెడ్డి

 • నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, ఆర్‌.రవీంద్రనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గొంగిడి సునీత,