టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడి పేరు పెట్టుకున్న స్టార్ హీరోలు వీళ్లే!

హిందువుల ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి పండుగ ఒకటి కాగా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ఆలయాలలో ఈరోజు శ్రీరామనవమి పండుగ ఘనంగా జరుగుతోంది.అయితే మన టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోల పేర్లలో రాముడి పేరు ఉంది.

 These Tollywood Star Heroes Having Lord Rama Names Details Here Goes Viral Tolly-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రాముడి పేరు పెట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉండటం గమనార్హం.

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ పేరు నందమూరి తారక రామారావు కాగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ రాముడి వేషంలో నటించి మెప్పించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు కాగా ఈ హీరో పేరుతో రామ్ చరణ్ పేరులో రాముడు ఉండటం గమనార్హం.

Telugu Ntr, Kalyan Ram, Kodandrami, Lord Srirama, Ram Charan, Ram Potenani, Rami

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన పోతినేని రామ్ కూడా రాముడి పేరు పెట్టుకుని ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.మరో టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ సైతం రాముడి పేరు పెట్టుకుని నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.మరో హీరో దగ్గుబాటి రానా పూర్తి పేరు దగ్గుబాటి రామానాయుడు అనే సంగతి తెలిసిందే.రానా పేరులో కూడా రాముడి పేరు ఉంది.మరో హీరో సాయిరామ్ శంకర్ పేరులో కూడా రాముడి పేరు ఉంది.

Telugu Ntr, Kalyan Ram, Kodandrami, Lord Srirama, Ram Charan, Ram Potenani, Rami

రాముడి పేరుతో ఉన్న ఈ హీరోలలో ఎక్కువమంది హీరోలుగా సక్సెస్ సాధించారు.ఈ హీరోలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వీళ్లు కాకుండా నటుడు రామిరెడ్డి, నిర్మాత సుబ్బరామిరెడ్డి, దర్శకులు కోదండరామిరెడ్డి, రామ్ గోపాల్ వర్మ పేర్లలో రాముడి పేరు ఉందనే సంగతి తెలిసిందే.

ఇతర భాషలలో కూడా రాముడి పేరుతో ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube