ఇప్పటి వరకూ టాలీవుడ్ లో వకీల్ సాబ్ పాత్రలో నటించిన హీరోలెవరో తెలుసా...?  

These Tollywood Heroes Played Vakeel Saab Roles - Telugu Tollywood, Tollywood Heroes Played Vakeel Saab, Tollywood Heroes Played Vakeel Saab Roles, Vakeel Saab, Vakeel Saab Movie News, Vakeel Saab News

అప్పట్లో విలక్షణ గొప్ప నటుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించినటువంటి జస్టిస్ చౌదరి, లాయర్ విశ్వనాథ్ వంటి చిత్రాల్లో వకీలు పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.ఇప్పటికీ ఈ చిత్రాలు టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకొని నిలిచిపోయాయి.

These Tollywood Heroes Played Vakeel Saab Roles

అయితే ఇంక అప్పటి నుంచి పలువురు హీరోలు కూడా ఈ లాయర్ పాత్రలో అదరగొట్టారు.ఇందులో భాగంగా యాక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన టువంటి యమజాతకుడు చిత్రంలో కూడా ప్రేక్షకులని బాగా అలరించాడు.

ఈ చిత్రంతో అప్పటి వరకూ సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న టువంటి మోహన్ బాబుకి స్టార్ హీరో ఫేమ్ దక్కింది.

అయితే సీనియర్ హీరోలే కాక అప్పట్లో యంగ్ హీరోలు టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించినటువంటి అధిపతి, విక్టరీ వెంకటేష్ నటించిన టువంటి ధర్మచక్రం శత్రువు వంటి చిత్రాల్లో వకీలు పాత్రలో అదరగొట్టారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే అభిలాష చిత్రం లో లాయర్ పాత్రలో బాగానే ఆకట్టుకోగా, నందమూరి నటసింహం, లెజెండ్ బాలకృష్ణ “ధర్మక్షేత్రం” అనే సినిమాలో  కోర్టులో పవర్ ఫుల్ డైలాగులు చెబుతూ లాయర్ పాత్రకే వన్నె తెచ్చాడు.అప్పట్లో ఈ కోర్టు సన్నివేశాలు సంచలనాలు సృష్టించాయి.

అయితే వీళ్లే కాక విలక్షణ నటుడు జగపతిబాబు, నటకిరీటి రాజేంద్రప్రసాద్, సీనియర్ హీరో శ్రీకాంత్ తదితరులు కూడా ఈ లాయర్ పాత్రలో నటించి ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలోనేప్రేక్షకులను మెప్పించారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే విడుదల చేయగా ఈ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తోంది.అంతేగాక ట్విట్టర్లో ఈ పోస్టర్ ని ఒక్కరోజులోనే 3.5 మిలియన్ మంది షేర్ చేస్తూ వకీల్ సాబ్ అనే ట్యాగ్ నీ ట్రెండింగ్ చేస్తున్నారు.ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలోనే ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఒక్కరోజులో 3.5 మిలియన్ల మంది షేర్ చేయడం ఇదే తొలిసారి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

These Tollywood Heroes Played Vakeel Saab Roles-tollywood Heroes Played Vakeel Saab,tollywood Heroes Played Vakeel Saab Roles,vakeel Saab,vakeel Saab Movie News,vakeel Saab News Related....