ODI World Cup India Cricket Team: వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవాలంటే ఈ ముగ్గురు ఉండాల్సిందే... లేదంటే?

ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ICC మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జరగబోతోందనే విషయం తెలిసినదే.కాగా దీనికి భారత్ వేదికగా నిలువనుంది.

 These Three Players Are Must For Team India To Win In Icc Odi World Cup 2023 Det-TeluguStop.com

అవును, ICC వన్డే వరల్డ్ కప్-2023 వచ్చే సంవత్సరం ఇదే సమయానికి అంటే అక్టోబర్, నవంబర్ మధ్య భారత్‌లో జరగనుంది.ఈమధ్య జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్‌లో ఓడిపోవడంతో వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో అయినా టీమిండియా గెలిస్తే బావుండనని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే గత కొంతకాలంగా భారత్ ఆటగాళ్లు మంచి ఆటతీరుని ప్రదర్శిస్తున్నారు.దీంతో వన్డే వరల్డ్ కప్ -2023‌లో భారత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఇండియా గెలవాలంటే ముఖ్యంగా టీమ్ మేనేజ్‌మెంట్ వన్డే వరల్డ్ కప్-2023 కోసం బౌలింగ్ విభాగంపై ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ బౌలింగ్ దళం దారుణంగా విఫలమవుతుంది.

టీమ్ భారీ స్కోర్ చేసినా ఓడిపోయిన సందర్భాలు అనేకం మనం చూసాము.వన్డే వరల్డ్ కప్-2023 దృష్టిలో ఉంచుకుని జట్టులో చేయాల్సిన మార్పులపై క్రికెట్ పండితులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.

Telugu Cricket, Hardik Pandey, Hardik Pandya, Icc Odi Cup, Krunal Pandya, Ravind

హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ టాప్ సిక్స్‌లో బ్యాటింగ్‌తో పాటు, కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే బ్యాకప్ ఆల్ రౌండర్లు జట్టుకు చాలా అవసరం అని చెబుతున్నారు.ముఖ్యంగా బ్యాకప్ ఆల్ రౌండర్ల జాబితాలో కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యార్, రిషి ధావన్ ఖచ్చితంగా ఉండాలని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.రిషి ధావన్ 2016లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసినదే.2021-22 విజయ్ హజారే ట్రోఫీలో ధావన్ అద్భుత ప్రదర్శన చేశాడు.ఇక కృనాల్ పాండ్యా వన్డే ఫార్మాట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే దుమ్ముదులిపేసాడు.వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో వన్డే కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube