మూడు ప్రాంతాల్లో ఈ ముగ్గురు పోటీ ? పెద్ద ప్లానే వేశారే ? 

మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ మూడు ప్రాంతాల్లో  పట్టు సాధించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు.అలాగే టిడిపి అధినేత చంద్రబాబు.

 These Three Competition In Three Areas Do You Have A Big Plan , Pavan Kalyan, Te-TeluguStop.com

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ పవన్ చేసిన ప్రకటన టిడిపికి కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.రాబోయే ఎన్నికల్లో ఒంరిగా ఎలా వెళ్లాలని ఆలోచిస్తున్న చంద్రబాబుకు పవన్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.

దాదాపు ఈ రెండు పార్టీలకు పొత్తు ఖాయమైన నేపథ్యంలో, వైసిపిని మరింత ఇరుక్కున పెట్టే విధంగా రాబోయే ఎన్నికల్లో ఓడించే విధంగా జనసేన ,టిడిపి లు ఉమ్మడిగా వ్యూహాన్ని రచిస్తున్నాయి.దీనిలో భాగంగానే ఏపీలోని రాయలసీమ, కోస్తా , ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తమ రెండు పార్టీల ప్రభావం కనిపించే విధంగా ప్లాన్ చేశారు.

Telugu Ap, Chandrababu, Janasenani, Pavan Kalyan, Telugudesam Tdp-Politics

ఈ మేరకు రాయలసీమ లోని చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి చంచంద్రబాబు పోటీ చేయబోతున్నారు.దీనికి జనసేన నుంచి పూర్తిగా మద్దతు లభించే విధంగా ప్లాన్ చేశారు.ఇక కోస్తా ప్రాంతమైన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.లోకేష్ పోటీ చేస్తే ఈ ప్రాంతంలో ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట.గాజువాక నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

ఈ విధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ముగ్గురు కీలక నేతలు పోటీ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో స్పష్టంగా ప్రభావం చూపించవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట.అంతేకాకుండా జగన్ అమలు చేయాలని చూస్తున్న మూడు రాజధానుల వ్యూహాన్ని తిప్పుకొట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారట.

విశాఖను పరిపాలన రాజధానిగా,  రాయలసీమను న్యాయ రాజధానిగా, కోస్తాను శాసన రాజధానిగా జగన్ చెబుతున్నారు.ఈ మూడు చోట్ల విపక్షానికి చోటు లేకుండా చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తుండడంతో, ఈ మూడు ప్రాంతాల్లోనూ ఈ ముగ్గురు కీలక నేతలు పోటీకి దిగి ఫలితాన్ని మార్చాలని లెక్కలు వేసుకుంటున్నారట.

Telugu Ap, Chandrababu, Janasenani, Pavan Kalyan, Telugudesam Tdp-Politics

దీంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా,  రాయలసీమ నుంచి రెండో సీటుకు పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట.తిరుపతి లేదా అనంతపురం నుంచి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారట.అటు ఉత్తరాంధ్రను ఇటు రాయలసీమలోనూ పోటీకి దిగడం వల్ల ఈ రెండు ప్రాంతాల్లోనూ జనసేన,  టిడిపిల కూటమి కి ఆదరణ ఉంటుందని పవన్ భావిస్తున్నారట.జనసేన పొత్తులు అధికారికంగా ఖరారు అయిన తరువాత ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకునే పనిలో వీరు ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube