ధనుర్మాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు.. ఏవంటే?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 16 వ తేదీ ధనుర్మాసం ప్రారంభమైంది.ఈ క్రమంలోనే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు.

 These Things Should Not Be Done Even My Mistake In Dhanurmasam Details, Dhanurm-TeluguStop.com

అందుకోసమే డిసెంబర్ 16 నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న రోజులను ధనుర్మాసం అంటారు.నెల రోజుల పాటు ఉండి ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు.

ఈ క్రమంలోనే ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు.అసలు ధనుర్మాసంలో పూజా కార్యక్రమాలు శుభ కార్యాలు ఎందుకు చేయకూడదు అనే విషయానికి వస్తే….

సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండడమే కాకుండా ఆయన గమనం నెమ్మదిగా ఉండడంతో పాటు బృహస్పతి ప్రభావం తక్కువగా ఉంటుంది.ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదనీ చెబుతారు.

ఈ క్రమంలోనే ఈ ధనుర్మాసంలో ఏ విధమైనటువంటి వివాహ శుభకార్యాలు, ఇతర శుభకార్యాలు చేయకూడదు.అదేవిధంగా ఈనెల ఏలాంటి వాహనాలు, నూతన గృహాలను స్థలాలను కొనుగోలు చేయకూడదు.

Telugu Bruhaspati, Dhanurmasam, Hindu, Lakshmidevi, Mahavishnu, Pooja, Worship-L

ధనుర్మాసం మంచిది కాకపోయినప్పటికీ పూజా కార్యక్రమాలకు ఎంతో అనువైన మాసం అని చెప్పవచ్చు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు.ఈ క్రమంలో ధనుర్మాసంలో కేవలం పూజా కార్యక్రమాలు, వ్రతాలు చేస్తారు.ప్రస్తుతం ఈ నెల మొత్తం ధనస్సు రాశిలో ఉన్న సూర్యుడు సంక్రాంతి పండుగ రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటివరకు సూర్యుడు గమనం నెమ్మదిగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube