వీక్ క్లైమాక్స్ వల్ల ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు ఇవే..?

కొన్ని సినిమాలు ఫస్ట్ సీన్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయి.అయితే క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్ల ఆయా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

 These Telugu Movies Are Flop Because Of Weak Climax At The End, Flop Result, T-TeluguStop.com

వీక్ క్లైమాక్స్ వల్ల ఫ్లాప్ అయిన తెలుగు సినిమాల జాబితాను పరిశీలిస్తే ఆ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి.స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ శీను అనే సినిమాలో మూగవాడిగా నటించారు.

ఈ సినిమా రీమేక్ మూవీ కాగా హీరోయిన్ కు మూగవాడిగా పరిచయమైన వెంకటేష్ క్లైమాక్స్ లో మూగవాడిగా మారిపోతారు.

క్లైమాక్స్ నచ్చకపోవడం వల్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు.

అల్లు అర్జున్, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటించిన వేదం సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ చనిపోతారు.

దర్శకుడు క్రిష్ క్లైమాక్స్ లో మార్పులు చేసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టై ఉండేదని బన్నీ, మనోజ్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.ప్రభాస్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన చక్రం సినిమా కుడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Telugu Bheemilikabaddi, Chakram, Flop Result, Merupu, Nakshatram, Seenu, Telugu,

టీవీల్లో సినిమాలు చూసే ప్రేక్షకులకు చక్రం సినిమా నచ్చినప్పటికీ థియేటర్లలో మాత్రం క్లైమాక్స్ లో హీరో చనిపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.నాని హీరోగా తెరకెక్కిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా తొలి సన్నివేశం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంటుంది.అయితే నాని చనిపోవడం వల్లే హిట్ టాక్ ను సొంతం చేసుకోవాల్సిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

Telugu Bheemilikabaddi, Chakram, Flop Result, Merupu, Nakshatram, Seenu, Telugu,

ప్రభుదేవా, అరవింద స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన మెరుపు కళలు సినిమా కూడా క్లైమాక్స్ వల్ల ఫ్లాప్ అయింది.చివరి నిమిషంలో అరవింద స్వామి ఫాదర్ గా మారిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు.నక్షత్రం సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ ను చంపేయడం కూడా ఆ సినిమాకు మైనస్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube