మన ఆచారాల వెనక ఎంత సైన్స్ దాగి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

These Superstitions By Indians Have Logic In Them -

మన భారతదేశంలో అనేక ఆచారాలు ,సంప్రదాయాలు ఉన్నాయి.వాటిని వేల సంవత్సరాల నుండి ప్రజలు పాటిస్తున్నారు.

These Superstitions By Indians Have Logic In Them

అయితే నేటి తరం వాటిని మూడ నమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు.అయితే కొంతమంది మాత్రం ఈ ఆచారాలను పాటిస్తున్నారు.

ఇప్పుడు మన ఆచారాల వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం.

ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక
పురాతన కాలంలో మగవారు బయటకు వెళ్లి శారీరక శ్రమ చేసేవారు.

దాంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు.స్త్రీలు ఇంటిలో ఉండుటవలన శ్రమ తక్కువగా ఉండేది.

అందువల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేతికి గాజులు ధరింప చేసేవారు.గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

అంతే కాకుండా ఆడ వారి శ‌రీరం నుంచి విడుద‌ల‌య్యే నెగెటివ్ శ‌క్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులు సహాయపడతాయి.

పిల్లలకు చెవులు కొట్టించటం
చిన్న పిల్లలకు చెవులు కొట్టించటం సాధారణమే.

అమ్మాయి అయినా అబ్బాయి అయినా చిన్నతనంలో చెవులు కుట్టిస్తారు.ఇలా కొట్టించటం వలన ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఆస్తమా దూరం అవుతుంది.

రావిచెట్టును పూజించటం
చాలా మంది హిందువులు రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు.రావి చెట్టు ఎక్కువగా దేవాల‌యాల్లోనే ఉంటుంది.అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌.దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం
మన హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన స్త్రీ కాలికి మెట్టెల‌ను ధరిస్తుంది.ఈ విధంగా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జరుగుతుంది.

దీంతో వారి రుతు క్ర‌మం స‌రిగ్గా వస్తుందట.అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది.

ఆలయాలలో గంటలు ఉండటం
ఆలయంలో గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు జాగృతం అవుతాయి.అలాగే కుడి,ఎడమ మెదడులు కొంత సేపు ఏకం కావటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

అంతేకాక ఏకాగ్రత పెరుగుతుంది.

నిదించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టకూడదు
భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది.ఒకవేళ తల ఉత్తరం వైపు పెట్టి పడుకుంటే శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వస్తాయి.అందువల్ల తలను ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదు.

నుదుటిన కుంకుమ ధరించటం
నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని ఉత్తేజితం చేస్తాయి.దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

రెండు చేతులతో నమస్కారం పెట్టటం
ఎదుటివారికి రెండు చేతులతో నమస్కారం పెట్టినప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి జ్ఞాపకశక్తి పెరిగి వారిని గుర్తు పెట్టుకుంటాం.అలాగే మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది.

గోరింటాకు పెట్టుకోవటం
చేతుల‌కు, కాళ్ల‌కు గోరింటాకు పెట్టుకోవడం వ‌ల్ల అక్క‌డ చివ‌ర్లో ఉండే న‌రాలు విశ్రాంతి పొందుతాయి.దీంతో శ‌రీరానికి విశ్రాంతి లభించి చ‌ల్ల‌ద‌నం ఇస్తుంద‌ట‌.అంతేకాదు గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, జ్వ‌రం, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

నేల మీద కూర్చొని భోజనం చేయటం
నేల మీద కూర్చొని భోజనం చేయటం వలన జీర్ణక్రియ బాగా జరిగి జీర్ణాశ‌య సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవండీ మన ఆచారాల వెనక ఉన్న సైన్స్ … చూసారుగా మీరు కూడా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

These Superstitions By Indians Have Logic In Them- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) These Superstitions By Indians Have Logic In Them-- Telugu Related Details Posts....

DEVOTIONAL