ఈ మొక్క‌లు ఇంట్లో ఉంటే షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌..తెలుసా?

`నాకు షుగ‌ర్ ఉందండీ.అని చెబుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగి పోతోంది.

 These Plants Can Control Blood Sugar Levels Naturally-TeluguStop.com

దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన షుగ‌ర్(మ‌ధుమేహం) వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కాదు.ప్ర‌స్తుత రోజుల్లో పాతిక‌, ముప్పై ఏళ్ల వారిలో సైతం చాలా కామ‌న్‌గా క‌నిపిస్తోంది.

కార‌ణం ఏమైన‌ప్ప‌టికీ ఒక్క సారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే జీవిత కాలంలో మందు వాడాలి.అదే స‌మ‌యంలో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

 These Plants Can Control Blood Sugar Levels Naturally-ఈ మొక్క‌లు ఇంట్లో ఉంటే షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌..తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పొర‌పాటున‌ కంట్రోల్ త‌ప్పాయా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అయితే మందులు ద్వారానే కాకుండా ఇంట్లో పెంచుకునే కొన్ని కొన్ని మొక్క‌ల ద్వారా కూడా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు త‌ప్ప‌కుండా చేసుకోవ‌చ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.క‌ల‌బంద.

దాదాపు అంద‌రి పెర‌టిలో ఉండే మొక్క ఇది.అయితే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు.క‌ల‌బంద ఎంతో మేలు చేస్తుంది.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో స్పూన్ క‌ల‌బంద జెల్ క‌లుపుకుని సేవించాలి.ఇలా రోజూ ఉద‌యాన్నే చేస్తే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.మ‌రియు బ‌రువూ త‌గ్గుతారు.

Telugu Blood Sugar Levels, Diabetes, Diabetic Patients, Good Health, Health, Health Tips, Latest News, Plants-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే క‌రివేపాకు మొక్క ఇంట్లో ఉన్నా షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు.అదెలా ఉంటే.ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఆరేడు క‌విపాకుల‌ను తీసుకుని బాగా న‌మిలి మింగాలి.ఇలా చేస్తే ర‌క్తంలో అధిక చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

Telugu Blood Sugar Levels, Diabetes, Diabetic Patients, Good Health, Health, Health Tips, Latest News, Plants-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

తిప్పతీగ మొక్క సైతం మ‌ధుమేహుల‌కు చాలా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.తిప్ప‌తీగ మొక్క మీ ఇంట్లో గ‌నుక ఉంటే.దాని ఆకుల‌ను నాలుగైదు తీసుకుని ఒక గ్లాస్ వాట‌ర్‌లో మ‌రిగించి.ప‌ర‌గ‌డుపున తాగండి.ఇలా చేస్తే షుగ‌ర్ వ్యాధి ఎల్ల‌ప్పుడూ కంట్రోల్‌లోనే ఉంటుంది.పైగా తిప్ప‌తీగ ఆకుల‌ను మ‌రిగిచిన వాట‌ర్ సేవిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

శ్వాసకోశ వ్యాధులు దూరం అవుతాయి.మ‌రియు ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మానసిక స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

#Diabetic #Tips #Diabetes

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు