ఈ పానీపూరీ నూడిల్స్ కనుక తిన్నారో.. వావ్ అనకుండా ఉండలేరు

పానీపూరీ ఈ వంటకాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.అంతలా పానీ పూరి అందరికీ నచ్చుతుంది.

 These Panipuri Noodles Are So Edible . You Can't Help But Say Wow,  Panipuri , N-TeluguStop.com

ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అపోహలు ఉండవు.ఇక పానీపూరీలానే చాలా మంది ఇష్టపడే మరో ఆహారం నూడిల్స్.

ఈ నూడిల్స్ ను తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.

ఇక ఈ నూడిల్స్ లో సాస్, జామ్ కూడా వేసుకుని తింటూ ఉంటారు.లక్నోకు చెందిన ఓ వ్యక్తి వేరే విధంగా ఆలోచించాడు.

అతడి ఆలోచనా విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ అతడు ఏమని ఆలోచించాడంటే.

పానీ పూరీ, నూడిల్స్ వీటి రెండింటిని జనాలు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.ఈ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందా? అని లక్నోకు చెందిన ఓ వ్యక్తికి పానీ పూరీ మరియు నూడిల్స్ ఎందుకు కలపకూడదనే ఆలోచన వచ్చింది.ఇలా అతడు అనుకున్నదే తడవుగా పానీ పూరీ నూడిల్స్ ను తయారు చేశాడు.ఇప్పటికే శాండ్ విజ్ పానీ పూరీ, ఫైర్ పానీ పూరీ, బర్గర్ పానీ పూరీ ఇలా ఇప్పటికే అనేక రకాల పానీపూరీలు మనకు తెలుసు.

తాజాగా నూడిల్స్ పానీ పూరీని కూడా లక్నోకు చెందిన ఓ వ్యక్తి చక్కగా చేస్తున్నాడు.ముందుగా పానీ పూరీల మీద బంగాళ దుంపలు, తిపి చట్నీ వేసాడు.ఆతర్వాత ఆ పానీపూరీల మీద నూడిల్స్ వేశాడు.అంతే కాకుండా ఆ నూడిల్స్ మీద పెరుగు వేశాడు.వింటూంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది కదూ.ఈ పానీ పూరీని తిన్న అనేక మంది చాలా బాగుందని చెబుతూ పోస్టులు పెడుతున్నారు.ఇలా నూడిల్స్ తో పానీ పూరీని చేస్తుంటే చూడడం ఇదే తొలి సారని అంటున్నారు.అతడు ఈ పానీ పూరీని ఎలా తయారు చేశాడో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube