నిద్ర బాగా ప‌ట్టాలంటే ఈ పోష‌కాలు ఎంతో అవ‌స‌రం..తెలుసా?

These Nutrients Are Essential For Good Sleep

కంటి నిండా నిద్ర ఉంటేనే శ‌రీరం యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది.లేదంటే ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య చుట్టుముట్టేందుకు సిద్ధం అయిపోతుంది.

 These Nutrients Are Essential For Good Sleep-TeluguStop.com

మ‌రియు నీర‌సం, అల‌స‌ట‌, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు సైతం తీవ్రంగా విసిగిస్తుంటాయి.అందుకే నిద్ర‌ను ఎప్పుడు కూడా నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

అయితే ఎంత ప‌డుకుందామ‌న్నా కొంద‌రికి నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.ఎప్పుడో ఒక రోజు ఇలా జ‌రిగితే పెద్ద ఇబ్బందేమి ఉండ‌దు.

 These Nutrients Are Essential For Good Sleep-నిద్ర బాగా ప‌ట్టాలంటే ఈ పోష‌కాలు ఎంతో అవ‌స‌రం..తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, రోజూ ఇలానే జ‌రుగుతుంటే మాత్రం చికాకు పుట్టేస్తుంది.

ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో అర్థంగాక కొంద‌రు స్లీపింగ్ పిల్స్‌కి అల‌వాటు ప‌డుతుంటారు.

అయితే వాస్త‌వానికి నిద్ర బాగా ప‌ట్టాలంటే కొన్ని కొన్ని పోష‌కాలు ఎంతో అవ‌స‌రం.అవి లోపించిన‌ప్పుడే నిద్ర స‌మ‌స్య‌లు వేధిస్తాయి.

మ‌రి ఎందుకు ఆల‌స్యం సుకంగా నిద్ర పోవాలంటే ఏయే పోష‌కాలు తీసుకోవాలో చూసేయండి.

Telugu Sleep, Tips, Latest, Problems-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

కంటి నిండా నిద్ర ప‌ట్టాలంటే మెగ్నీషియం త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాలి.రోజుకు అవసరమైన కనీస మెగ్నీషియం తీసుకుంటేనే నిద్ర‌ను ప్రేరేపించే మెలటోనిన్ ఉత్ప‌త్తి అవుతుంది.అలాగే విటమిన్ బి 12 లోపం ఏర్ప‌డినా నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు.

మ‌రియు అల‌స‌ట చాలా అధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, రోజూ విట‌మిన్ బి 12 ఉండే ఆహారాల‌ను డైట్‌లో చేర్చు కోవాలి.

మీకు ప్ర‌తి రోజూ నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదు అంటే ఖ‌చ్చితంగా విట‌మిన్ సి ఫుడ్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది.ఎందు కంటే, ర‌క్తంలో విట‌మిన్ సి కంటెంట్ త‌గ్గిన‌ప్పుడు కూడా నిద్ర లేమికి గుర‌వుతారు.

ఇక ఇవే కాదు నిద్ర బాగా ప‌ట్టాలీ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐర‌న్‌, విట‌మిన్ డి వంటి పోష‌కాల‌ను కూడా ప్ర‌తి రోజు తీసుకోవాలి.త‌ద్వారా నిద్ర స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.

#Problems #Sleep #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube