క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి న్యూ రూల్స్

ప్రస్తుతం ప్రతిఒక్కరూ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఏటీఎం కార్డులు వాడేవారు.

 These New Rules Of Credit And Debit Cards Will Come Into Effect From October 1 Details, Credit Card, Debit Cards, New Rules, October 1, Latest News, New Rules Of Credit And Debit Cards , October 1, Reserve Bank Of India, Debit Cards Limit, Debit Cards Activations-TeluguStop.com

కానీ ఇప్పుడు వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది.దీంతో బ్యాంకులు కూడా సెక్యూరిటీ కోసం అనేక నిబంధనలు అమలు చేస్తున్నాయి.

డెబిట్, క్రెడిట్ కార్డ్స్ కు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెడుతున్నాయి.ఈ క్రమంలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డ్స్ కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

 These New Rules Of Credit And Debit Cards Will Come Into Effect From October 1 Details, Credit Card, Debit Cards, New Rules, October 1, Latest News, New Rules Of Credit And Debit Cards , October 1, Reserve Bank Of India, Debit Cards Limit, Debit Cards Activations-క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి న్యూ రూల్స్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి నిర్దేశించిన అమలు గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల పాటు పొడిగించింది.జులై 1 నుంచి నిబంధనలు అమలు కావాల్సి ఉంది.

కానీ బ్యాంకుల నుంచి వచ్చిన వినతుల మేరకు అక్టోబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ గడువు, క్రెడిట్ లిమిట్ కు సంబంధించిన పలు అంశాలు ఇందులో ఉన్నాయి.

క్రెడిట్ కార్డు జారీ చేసిన 30 రోజుల్లో వాటిని కస్టమర్లు యాక్టివేట్ చేసుకోవాలి.ఒకవేళ యాక్టివేట్ చేసుకోకపోతే ఓటీటీ ద్వారా కస్టమర్ నుంచి అనుమతి తీసుకోవాలి.అయితే క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ కు కస్టమర్ నుంచి అనుమతి లభించకపోతే ఖతాదారుడి నుంచి ధృవీకరణ కోరిన ఏడు రోజుల్లోగా క్రెడిట్ కార్డు ఖాతాను మూసివేయాలని ఆర్బీఐ తన నిబంధనల్లో పేర్కొంది.

అయితే క్రెడిట్ లిమిట్ ను దాటకుండా బ్యాంకులు చూడాలి.

అలాగే క్రెడిట్ కార్డు ఛార్జీలపై చక్రవడ్డీని వేయడానికి సంబంధించిన నిబంధన అమలును కూడా జులై 1 నుంచి 3 నెలల పాటు ఆర్బీఐ వాయిదా వేసింది.అయితే మాస్టర్ డైరెక్షన్ లో మిగతా నిబంధనల అమలుకు సంబంధించిన గడువును జులై 1 వరకు ఉందని, అందులో మార్పు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube