ఈ నక్సల్స్ చాలా వెరైటీ.. వీరి లైఫ్ చూస్తే.. నోరేళ్లబెట్టాల్సిందే..!

సాధారణంగా నక్సలైట్ అంటే జనసంచారానికి దూరంగా అడవుల్లో ఉంటూ తుపాకి చేతబట్టి ప్రభుత్వాలపై పోరాటం సాగిస్తుంటారు.ఇది అందరికీ తెలిసిందే.

 These Naxals Are Very Variety If You Look At Their Luxury Life Details, Naxals,-TeluguStop.com

అయితే ఈ నక్సలైట్స్ మాత్రం ఇందుకు విరుద్ధం.విలాసవంతమైన హాటల్లో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

ఝార్ఖండ్ రాజధాని రాంచిలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో నక్సలైట్స్ ఉన్నారని పక్కా సమాచారం రావడంతో పోలీసులు హోటల్‌పై దాడి చేశారు.

ముగ్గురు నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.అయితే వారు అనుభవిస్తున్న లగ్జరీ జీవితాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.పట్టుబడిన అమీర్‌చంద్ కుమార్, ఆర్య కుమార్ సింగ్, ఉజ్వల్ కుమార్ సాహు అనే ముగ్గురు నక్సల్స్.పీపుల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PLFI) దళానికి చెందిన సభ్యులుగా పోలీసులు గుర్తించారు.వీరి నుంచి రూ.50 లక్షల విలువైన బీఎండబ్ల్యూ, రూ.17 లక్షల విలువైన థార్ వంటి డజనుకు పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ముగ్గురు నక్సల్స్‌ను అరెస్ట్ చేసి…12 కార్లు, రూ.3.5 లక్షల నగదు, 5 సిమ్ కార్డులు, టెంట్ సామాగ్రిని స్టేషన్‌కు తరలించారు.

అయితే వీరికి.నివేష్ కుమార్, ధువర్ సింగ్, శుభమ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు బయటి నుంచి సహాయం చేస్తున్నారని.నిత్యావసరాలు, ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.అయితే వీరు పరారీలో ఉన్నట్లు వీరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నక్సలైట్స్ ప్రముఖులు, సంపన్నులను టార్గెట్ చేసి బెదిరించడం.వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

కార్ల నెంబర్ ప్లేట్లు పలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో కొనుగోలు చేశారా? లేక ఎవరినైనా బెదిరించి తీసుకొచ్చారా అన్న కోణంలో విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube