జుట్టు రాలిపోవడం, చిట్లి పోవడం, డ్రైగా మారడం, చుండ్రు.ఇలా ఎన్నో సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
వీటిని నివారించుకునేందుకు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ హాయిల్స్ను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.కానీ, జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడంలో కొన్ని సహజ సిద్ధమైన నూనెలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి లేటెందుకు ఆ సహజ సిద్ధమైన నూనెలు ఏంటీ.? వాటిని ఎలా తయారు చేయాలి.? అన్న విషయాలు చూసేయండి.
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది చుండ్రు సమస్యతో నానా పాట్లు పడుతుంటారు.
అలాంటి వారు.ఫ్రెష్‌గా ఉన్న గుప్పెగు పుదీనా ఆకులను తీసుకుని మెత్తగా నూరుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కప్పు బాదం ఆయిల్ మరియు పుదీనా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి నాలుగైదు రోజుల పాటు ఎండలో ఉంచాలి.అపై ఈ నూనెను తల మొత్తానికి పూసి గంట తర్వాత తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు పరార్ అవుతుంది.
అలాగే కొందరికి హెయిర్ ఫాల్ సమస్య చాలా అధికంగా ఉంటుంది.
అలాంటి వారు కొన్ని నిమ్మ తొక్కలను తీసుకుని మిక్స్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక కప్పు ఆలివ్ ఆయిల్లో నిమ్మ తొక్కల పేస్ట్ యాడ్ చేసి లైట్‌గా హీట్ చేయాలి.
ఈ నూనెను జుట్టుకు పూసుకుంటే.క్రమంగా హెయిర్ పాల్ సమస్య తగ్గుతుంది.

ఇక గుప్పెడు చప్పున వేపాకులు, తులసి ఆకులు, మెంతులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.అపై ఈ మిశ్రమంలో రెండు కప్పుల కొబ్బరి నూనె వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి నూనెను వడబోసుకోవాలి.ఈ నూనెను తరచూ జుట్టుకు వాడితే.డ్రై హెయిర్ సమస్య ఉండదు.జుట్టు కుదుళ్లు బలంగా మారి రాలడం తగ్గుతుంది.
మరియు వైట్ హెయిర్ సమస్య దరి చేరకుండా ఉంటుంది.