ఇకపై కార్లలలో ఇవి తప్పక ఉండాల్సిందే: కేంద్ర ప్రభుత్వం

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి.ఎంతోమంది వాహన ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు.

 These Must No Longer Be In Cars The Central Government, Air Bags, Vehicles, Cars-TeluguStop.com

కనీస ముందు జాగ్రత చర్యలు కూడా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అధిక వేగంతో గమ్యాన్ని చేరాలని అనుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు.వాళ్ళ కుటుంబాలు సైతం రోడ్డున పడుతున్నాయి.

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా సీటు బెల్టు ధరించకపోవడం, ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక తప్పనిసరి నిర్ణయం అమలు చేయబోతుంది.

అది ఏంటంటే.ఇకమీదట అన్ని కార్లల్లో ముందు సీట్ల ప్రయాణీకుల వైపు కూడా ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి అని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

గతంలో అన్ని కార్లలోని డ్రైవింగ్ సీటుకి మాత్రమే ఎయిర్ బ్యాగ్ ని తప్పనిసరి చేసిన కేంద్రం.ఇప్పుడు డ్రైవర్ పక్క సీటుకి కూడా ఎయిర్ బ్యాగ్ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది.రవాణా మంత్రిత్వశాఖ జారీ చేసిన ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం.ఏప్రిల్-1, 2021 నుంచి ఉత్పత్తి చేసే అన్ని మోడల్ కార్లకు ఈ ఎయిర్ బ్యాగ్స్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.మరి ఇప్పుడు తిరిగే కార్ల సంగతి ఏంటనే ప్రశ్న మీకు రావచ్చు.దానికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించింది ప్రభుత్వం.

Telugu Air Bags, Cars, Central, Road, Safety, Vehicles-Latest News - Telugu

ప్రస్తుతమున్న కార్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాలనే నిబంధనను విధించనున్నారు.దీనికి జూన్ 1 వరకు గడువు ఇవ్వనున్నారు.ఈ ప్రతిపాదనపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది ప్రభుత్వం.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది పాత వాహనాలకు కూడా ఎయిర్‌ బ్యాగ్స్ అమర్చే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ భారాన్ని కూడా కొన్ని సంస్థలు ప్రజలపై మోపే భారం ఉంది.దీనికి సంబంధించి కూడా కేంద్రం తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

ఇదే కనుక అమలు అయితే ఇకమీదట రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube