పొరపాటున స్త్రీలు ఈ తప్పులు చేస్తే పుణ్యం హరించుకుపోతుంది?

సాధారణంగా వివాహమైన స్త్రీలు కలకాలం దీర్ఘ సుమంగళీగా ఉండాలంటే దానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని చెబుతుంటారు.తలలో పువ్వులు మొదలుకొని కాలికి మెట్టెలు ధరించే వరకూ ప్రతిదీ వారి చేసుకున్న పుణ్యానికి ప్రతిఫలంగా దక్కుతాయని చెబుతుంటారు.

 These Must Be Followed For Women To Have Access To Lakshmi, Womens, Lakshmi, Poo-TeluguStop.com

ఈ క్రమంలోనే కొందరు మహిళలు వివాహం కంటే ముందుగానే ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు.కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వల్ల వారు చేసుకున్న పుణ్యం మొత్తం హరించుకుపోతుంది.

మరి స్త్రీలు చేయకూడని పొరపాట్లు, తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక మహిళ చేసే వ్రతాలు, పూజలు, నోముల వల్ల తనకు పుణ్యఫలం కలిగి తన భర్త పిల్లల ఆరోగ్యం, ఆ ఇంట ఐశ్వర్యం అభివృద్ధి చెందుతాయని భావిస్తారు.

కానీ కొందరి విషయంలో ఎన్నో శుభకార్యాలు చేసిన సుఖం లేదంటే వారికి పుణ్యఫలం కరిగిపోతుందని అర్థం.అందుకు గల కారణం మహిళలు ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల వారు చేసిన పుణ్యఫలం హరించుకుపోతుంది.

ఆ కోపమే దుఃఖాలకు, బాధలకు కారణం అవుతుంది.

స్త్రీలలో కోపంతో పాటు ఆవేశం కూడా మంచిది కాదు.

ఆవేశంతో పాటు అబద్ధాలు చెప్పిన వారు చేసిన పుణ్యానికి ప్రతిఫలం దక్కదు.ముఖ్యంగా భర్తకు చెప్పే అబద్ధాలు వల్ల వారు చేసిన పుణ్య కార్యం హరించుకుపోతుందని పండితులు చెబుతున్నారు.

కనుక స్త్రీలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అబద్ధాలు చెప్ప కూడదు, ఈ విధంగా చేయటం వల్ల వారు చేసిన పుణ్య కార్యాలు వృధా అవుతాయని, ఎలాంటి పరిస్థితులలో కూడా ఈ విధమైన పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube