సాధారణంగా ఫస్ట్ డే టాక్ ఆశించిన రేంజ్ లో లేకపోతే సినిమా పుంజుకోవడం కష్టమని సినిమా హిట్ అయ్యే అవకాశం లేదని చాలామంది భావిస్తారు.అయితే కొన్ని సినిమాలు మాత్రం టాక్ తో, రివ్యూలతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి.
పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాకు( Badri Movie ) మొదట ఆశించిన టాక్ రాలేదు.అయితే రెండో రోజు నుంచి ఈ సినిమా టాక్ మారడంతో పాటు కలెక్షన్ల విషయంలో అదుర్స్ అనిపించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాకు( Gangotri Movie ) సైతం మొదట పాజిటివ్ టాక్ రాలేదు.ఈ సినిమా దర్శకేంద్రుడి 100వ సినిమా అయినా మొదట నెగిటివ్ టాక్ వచ్చింది.
అయితే తర్వాత టాక్ మారడంతో పాటు ఈ సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ పోకిరి సినిమాకు( Pokiri ) సైతం మొదట నెగిటివ్ టాక్ వచ్చింది.
అయితే టాక్ క్రమంగా మారడంతో పాటు పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బన్నీ సరైనోడు సైతం ఈ జాబితాలో ఉన్నాయి.ఈ సినిమాలకు సైతం మొదట ఆశించిన రేంజ్ లో టాక్ రాలేదు.రామ్ చరణ్ రచ్చ, మాస్ మహారాజ్ విక్రమార్కుడు,( Vikramarkudu ) ధమాకా( Dhamaka ) సినిమాలు సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.
వెంకటేశ్ నటించిన లక్ష్మీ, ప్రభాస్ నటించిన మిర్చి, సుడిగాలి సుధీర్ గాలోడు ఫ్లాప్ టాక్ తో మొదలై చివరకు హిట్లుగా నిలిచాయి.

ఈ సినిమాలకు క్రిటిక్స్ నుంచి సైతం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.రొటీన్ కథ అని, ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమాలు నచ్చవని, పాత చింతకాయపచ్చడి లాంటి సినిమాలని ఈ సినిమాల గురించి కామెంట్లు వినిపించగా రిజల్ట్ మాత్రం క్రిటిక్స్ ను షాకిచ్చింది.గతేడాది విడుదలైన వీరసింహారెడ్డి సినిమా( Veerasimha Reddy ) కూడా నెగిటివ్ టాక్ తో మొదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఈ సినిమాలలో చాలా సినిమాల సక్సెస్ కు ఆయా సినిమాల్లో నటించిన హీరోల ప్రతిభే కారణమని ఫ్యాన్స్ భావిస్తారు.