పెళ్లిలో ఈ పొరపాట్లు చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం.ఈ క్రమంలోనే వివాహ సమయంలో ప్రతి ఒక్క కార్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సరైన ముహూర్తంలో సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆచరిస్తారు.

 These Mistakes Should Be Avoided During The Wedding Marriage , These Mistakes, W-TeluguStop.com

వివాహ బంధం ద్వారా ఇద్దరి జీవితాలు మూడుముళ్ల బంధంతో ఒక్కటై పదికాలాలపాటు పచ్చగా కొనసాగాలని పెళ్లి కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగేలా చూస్తారు.అయితే కొన్ని సమయాల్లో పెళ్లిల్లో  పొరపాట్లు జరగడం సర్వసాధారణం.

పెళ్లిలో ఏ పొరపాట్లు చేస్తే ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

పెళ్లి సమయంలో సరైన ముహూర్తానికి మాంగల్యధారణ జరగకపోవటం వల్ల ఏ విధమైనటువంటి అనర్ధాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.

సరైన సమయానికి మాంగల్యధారణ జరగకపోతే భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలు లోపిస్తాయి.కనుక సరైన ముహూర్తానికి మాంగల్యధారణ జరగడం తప్పనిసరి.

పెళ్లి తంతు కార్యక్రమం పై కాకుండా ఫోటోలు వీడియోల పై దృష్టి సారించడం వల్ల పూర్తిగా మన సంస్కృతి సాంప్రదాయాలు లోపిస్తాయి.తలంబ్రాలకు బదులుగా ధర్మకోల్ వాడటం వల్ల బందు ద్వేషం ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

Telugu Maangala Daryam, Sandals, Talambralu, Hall-Telugu Bhakthi

పెళ్లికి వచ్చిన అతిథులు చెప్పులు వేసుకుని వధూవరులను ఆశీర్వదించడానికి పెళ్లి మండపం పైకి వెళ్ళటం వల్ల పెళ్లి మండపంలో ఉన్న దేవతలు వెళ్లి పోయి ఇబ్బందులు కలుగుతాయని భావిస్తారు.అయితే ప్రస్తుతం ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ చెప్పులతోనే పెళ్లి వేదికపైకి వెళ్తున్నారు.పెళ్లిలో వేద మంత్రాలు మైకులో వినకుండా వేదమంత్రాల స్థానంలో సినిమా పాటలు పెట్టడం వల్ల దైవ కటాక్షానికి దూరమవుతారు.అయితే ప్రస్తుత కాలంలో సంస్కృతి సంప్రదాయాలను గాలికి వదిలి కేవలం ఫ్యాషన్ ప్రపంచంలో పడి ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండటం కోసం ముందుగా ఈ విధమైన ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube