ఈ జ్యూసులు తాగితే ప్లేట్‌లెట్స్ అమాంతం పెరుగుతాయ‌ట తెలుసా?

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ మ‌హ‌మ్మారి కార‌ణంగా చాలా మందిలో ప్లేట్‌లెట్స్ ప‌డిపోతున్నాయి.

 Juices, Platelets, Blood, Latest News, Health Tips, Good Health, Health, Health-TeluguStop.com

దాంతో వారి ప్రాణాలే రిస్క్‌లో ప‌డుతున్నాయి.అయితే అలాంటి స‌మ‌యంలో మంద‌ల కంటే కొన్ని కొన్ని జ్యూసుల ద్వారానే వేగంగా ప్లేట్ లెట్స్‌ను పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఆ జ్యూసులు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ గడ్డి జ్యూస్ బ్ల‌డ్ లో ప్లేట్ లెట్స్‌ను పెంచ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌ప‌తాయి.అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు ఉద‌యాన్నే గోధుమ గ‌డ్డితో త‌యారు చేసిన జ్యూస్‌ను సేవిస్తే గ‌నుక అందులో ఉండే కొన్ని ప్రత్యేకంగా పోష‌కాలు ప్లేట్ లెట్స్ పెరిగేలా ప్రోత్స‌హిస్తాయి.

బీట్ రూట్, క్యారెట్.

ఈ రెండిటిలోనూ బోలెడ‌న్ని పోష‌క విలువ‌లు దాగి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే ప్లేట్ లెట్స్‌ను పెంచ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అవును, రోజూ ఈ రెండిటిని క‌లిసి జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకుంటే ప్లేట్ లెట్ల సంఖ్య అమాంతం పెరుగుతుంది.

అలాగే లెమ‌న్ జ్యూస్ సైతం ప్లెట్ లెట్స్‌ను పెంచ‌గ‌ల‌వు.రెగ్యుల‌ర్‌గా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో రెండు స్పూన్ల లెమ‌న్ జ్యూస్ యాడ్ చేసుకుని సేవిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

పాల‌కూర జ్యూస్‌తోనూ బ్ల‌డ్‌లో ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుకోవ‌చ్చు.ఫ్రెష్‌గా ఉండే లేత పాల‌కూర‌ను తీసుకుని మెత్త‌గా గ్రాండ్ చేసి జ్యూస్ తీసుకుని సేవించాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే ప్లేట్ లెట్స్ చ‌క్క‌గా పెరుగుతాయి.

బొప్పాయి ఆకులు ప్లేట్ లెట్స్‌ను పెంచ‌డంలో ఓ సూప‌ర్ మెడిసిన్‌లా ప‌ని చేస్తాయి.అందు వ‌ల్ల త‌ర‌చూ బొప్పాయి ఆకుల‌తో జ్యూస్ త‌యారు చేసికుని తీసుకుంటే ప్లేట్ లెట్స్ గ‌ణ‌నీయంగా పెరుగుతాయి.ఇక ఇవే ఆకుండా దానిమ్మ జ్యూస్‌, కివి పండు జ్యూస్‌, ఆమ్లా జ్యూస్ వంటివి కూడా ప్లెట్ లెట్స్‌ను పెంచ‌గ‌ల‌వు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube