కంటి చూపు తగ్గడం. వయసు పైబడే కొద్ది కనిపించే సమస్యల్లో ఇది ఒకటి.
కానీ నేటి రోజుల్లో పదేళ్ల పిల్లల్లో సైతం కంటి చూపు మందగిస్తోంది.ఆహారపు అలవాట్లు, స్మార్ట్‌ఫోన్ టీవీలను ఎక్కువగా వీక్షించడం, పోషకాల కొరత, ఒత్తిడి వంటివి కంటి చూపు తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే కంటి చూపును అద్భుతంగా పెంచుకోవచ్చు.అంతేకాదు, మీరు కళ్ళజోడును కూడా వాడక్కర్లేదు.
అంత ఎఫెక్టివ్‌గా ఈ రెమెడీ పని చేస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటో.? ఎలా తయారు చేసుకోవాలో.? తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో నాలుగంటే నాలుగు బాదం పప్పులు వేసి వాటర్ పోసి మూడు లేదా నాలుగు గంటల పాటు నాన బెట్టుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ సోంపు, చిన్న పటిక బెల్లం ముక్క, నానబెట్టుకుని పీల్ తీసిన బాదం పప్పులు వేసి మెత్తగా రుబ్బకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కలిపి ఉదయం పూట సేవించాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక బాదం, సోంపు మరియు పటిక బెల్లంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మందగించిన కంటి చూపును క్రమంగా పెంచుతాయి.అదే సమయంలో ఇతర దృష్టి సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గు ముఖం పడతాయి.
అలాగే బాదం, సోంపు మరియు పటిక బెల్లం కలిపిన పాలను రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి సూపర్‌గా పెరుగుతుంది.
ఎముకలు, దంతాలు, కండరాలు దృఢంగా మారతాయి.రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.మరియు నిద్ర లేమి సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.