వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా తాగాల్సిన హెర్బ‌ల్ టీలు ఇవే!

These Herbal Teas Are Very Good For Health In Winter Season

వింట‌ర్ సీజ‌న్ మెల్ల మెల్ల‌గా స్టార్ట్ అవుతోంది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలో కాస్త అజాగ్ర‌త్త‌గా ఉన్నా నానా తిప్ప‌లు ప‌డాల్సి ఉంటుంది.

 These Herbal Teas Are Very Good For Health In Winter Season-TeluguStop.com

సాధారణ రోజులతో పోల్చితే చలి కాలంలో ఉష్ణోగ్రతలు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మారిపోతుంది.అందుకే ఈ సీజ‌న్‌లో త‌ర‌చూ జ‌లుబు, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ‌, ఆస్త‌మా త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అలాగే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా వింట‌ర్‌లో తీవ్రంగా వేధిస్తుంటాయి.అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టి హెల్తీగా, ఫీట్‌గా ఉండాల‌నుకుంటే ఖ‌చ్చితంగా కొన్ని హెర్బ‌ల్ టీల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

 These Herbal Teas Are Very Good For Health In Winter Season-వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా తాగాల్సిన హెర్బ‌ల్ టీలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి లేటెందుకు ఆ టీలు ఏంటో ఓ లుక్కేసేయండి.

రోజ్ గ్రీన్ టీ.

రుచిగా ఉండ‌ట‌మే కాదు చ‌లి కాలంలో బోలెడ‌న్ని ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను అందిస్తుంది.పైగా ఈ టీని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సులువు.

ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీటిని ఒక్క నిమిషం పాటు మరగనివ్వాలి.ఆ త‌ర్వాత అందులో కొన్ని ఎండిన గులాబీ రేఖ‌లు, ఒక స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్ వేసుకుని రెండు నిమిషాల పాటు మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.

ఆపై రుచికి స‌రిప‌డా తేనె క‌లిపి సేవిస్తే.ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

జుట్టు మ‌రియు చ‌ర్మం ఆరోగ్యంగా మారుతుంది.

Telugu Good Health, Health, Health Tips, Herbal Teas, Latest News, Teas, Winter Season, Winter Season Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే వింట‌ర్‌లో పుదీనా-అల్లం టీ కూడా హెల్త్‌కి చాలా మేలు చేస్తుంది.ఒక గ్లాస్ వాట‌ర్‌లో గుప్పెడు పుదీనా ఆకులు, దంచిన అల్లం ముక్క వేసి మ‌రిగించి ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకుని రోజూ సేవిస్తే.

జ‌లుబు, ద‌గ్గు, గొంతు సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.ఆస్త‌మా ల‌క్ష‌ణాలు కంట్రోల్ అవుతాయి.

చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లూ ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఇక ఇవే కాకుండా పసుపు టీ, తులసి టీ, హైబిస్కస్ టీ, అశ్వగంధ టీ వంటి వాటిని కూడా చ‌లి కాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి మ‌రియు చ‌ర్మానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు.

#Season Tips #Herbal Teas #Season #Tips #Teas

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube