ఇకపై ఆ ఫోన్లలో ఈ గూగుల్ సేవలు ఇక పని చేయవు..!

పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌లపై పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ షాకిచ్చింది.తమ సైన్-ఇన్ సేవలను ఓల్డర్ ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్లపై నిలిపివేస్తున్నామని ప్రకటించింది.ఈ నిర్ణయం వల్ల 2.3.7 వర్షన్‌ లేదా అంతకంటే తక్కువ వర్షన్‌తో నడుస్తున్న స్మార్ట్‌ఫోన్లపై ప్రభావం పడనుంది.అయితే, గూగుల్ అకౌంట్ల సైన్-ఇన్ సపోర్ట్ సేవలు సెప్టెంబర్ 27 నుంచి నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.

 These Google Services Will No Longer Work On Those Phones  Google Services, Andr-TeluguStop.com

ఇక ఆ తర్వాత యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వంటి గూగుల్ యాప్స్ లో సైన్-ఇన్ చేయడం కుదరదు.

ఒకవేళ ఈ ఫోన్ వినియోగదారులు గూగుల్ యాప్‌లలో సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించినా యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎర్రర్ అని వస్తుంది.

అయితే ఈ గూగుల్ సైన్-ఇన్ సేవలను బ్రౌజర్లలో పొందవచ్చు.ఉదాహరణకు, ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఉంటే దాంట్లో సైన్-ఇన్ చేయడం కుదరదు.

కానీ బ్రౌజర్ లోకి వెళ్లి యూట్యూబ్ లో సైన్-ఇన్ చెయ్యొచ్చు.అయితే యూజర్ల గూగుల్ ఖాతాలను సంరక్షించడానికే.

పాత ఆండ్రాయిడ్ వర్షన్ కలిగిన ఫోన్ అప్లికేషన్లలో సైన్-ఇన్ సపోర్టు నిలిపి వేస్తున్నామని సదరు కంపెనీ తెలిపింది.

Telugu Android Mobiles, Google, Latest, Worked-Latest News - Telugu

ఓల్డ్ ఆండ్రాయిడ్‌ వర్షన్ మొబైల్ ఫోన్లలో వినియోగించే అప్లికేషన్లకు అప్డేట్స్ రాక చాలా కాలం అయింది.దీనివల్ల హ్యాకర్లు ఈ అప్లికేషన్లను ఈజీగా యాక్సెస్ చేయగలరు.తద్వారా యూజర్ల ఖాతాల ప్రైవసీకి భంగం వాటిల్లుతుంది.

అందుకే, గూగుల్ సంస్థ తమ సైన్-ఇన్ మద్దతును ఉపసంహరించుకోనుంది.అయితే, కనీసం ఆండ్రాయిడ్‌ 3.0 హనీకోంబ్‌ వోఎస్‌కు తమ స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్ ‌చేసుకోవాలని 2.3.7 వర్షన్ ఫోన్ల‌ను వాడుతున్న యూజర్లకు గూగుల్ సూచించింది.పాత ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని గూగుల్ పేర్కొంది.

వారంతా కూడా వర్షన్లకు అప్‌గ్రేడ్ కావాలని గూగుల్ ప్రోత్సహిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube