ఈ పండ్ల‌ను క‌లిపి తీసుకుంటే తిప్ప‌లు త‌ప్పవు..జాగ్ర‌త్త‌!

ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన వ‌రాల్లో పండ్లు ఒక‌టి.ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.

 These Fruits You Should Never Mix And Eat! Fruits, Fruits Mix, Latest News, Heal-TeluguStop.com

అనేక పోష‌కాల పండ్ల ద్వారా పొందొచ్చు.ఎన్నో జ‌బ్బుల‌ను కూడా పండ్ల‌తో నివారించుకోవ‌చ్చు.

అందుకే ఏదో ఒక పండును రోజుకు ఒక‌టైనా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతారు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

కొన్ని పండ్ల‌ను క‌లిపి లేదా ఒకేసారి తీసుకోరాద‌ని అంటున్నారు.ఆ పండ్లు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టి పండు మ‌రియు జామ పండు.ఈ రెండిటిలోనూ పోష‌కాలు మెండుగా ఉంటాయి.ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను కూడా చేకూరుస్తాయి.కానీ, ఈ రెండిటిని క‌లిపి తీసుకోవ‌డం లేదా ఒకే సారి తీసుకోవ‌డం అస్స‌లు మంచిది కాదు.

ఇలా చేస్తే ఈ రెండు పండ్ల స‌మ్మేళ‌నం వ‌ల్ల వాంతులు, వికారం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్యలు ఏర్ప‌డ‌తాయి.

అలాగే పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పుచ్చ‌కాయ‌లో ఉండే పోష‌కాలు బోలెడ‌న్ని జ‌బ్బుల‌కు కూడా చెక్ పెడ‌తాయి.అటువంటి పుచ్చ‌కాయ‌ను ఎప్పుడూ కూడా వేరే పండ్ల‌తో క‌లిపి తీసుకాదు.

అలాగే పుచ్చ‌కాయ తీసుకున్న వెంట‌నే వేరే పండ్ల‌ను కూడా తీసుకోరాదు.అలా తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు తిప్పిన‌ట్టు అనిపించ‌డం, గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక బొప్పాయి పండు, నిమ్మ పండు కూడా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌లిపి తీసుకోరాదు.ఈ కాంబినేష‌న్ హిమోగ్లోబిన్ స్థాయిని త‌గ్గించేసి ర‌క్త హీన‌త‌కు దారి తీస్తుంది.అలాగే ద్రాక్ష మ‌రియు స్ట్రాబెర్రీ పండ్ల‌ను కూడా క‌లిపి తీసుకోరాదు.ఈ కాంబినేష‌న్ వ‌ల్ల గుండెల్లో మంట‌, త‌ల తిర‌గ‌డం, పుల్లని త్రేన్పులు రావడం వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

కాబ‌ట్టి, పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా.వాటి విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube