ఒత్తిడి. ఇదో మానసిక సమస్య.
దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు.అయితే కొందరు ఈ సమస్య నుంచి త్వరగానే బయట పడతారు.
కానీ, కొందరు మాత్రం ఆ ఒత్తిడిని మరింత పెంచుకుంటూ.మానసికంగా మరియు శారీరకంగా కృంగిపోతుంటారు.
ఒత్తిడి వల్ల బాధ, కోపం లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగిపోతాయి.అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరడానికీ ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటుంది.
అందుకే ఒత్తిడిని ఎంత త్వరగా నివారించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
అయితే చాలా మంది ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేందుకు మందులు వాడతారు.
కానీ, కొన్ని కొన్ని పండ్ల ద్వారా కూడా ఒత్తిడిని చిత్తు చేయవచ్చు.మరి ఆ పండ్లు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి క్షణాల్లోనే తరిమి కొట్టడంలో బొప్పాయి పండు గ్రేట్‌గా సహాయపడుతుంది.బొప్పాయి పండు ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు.
ఒత్తిడిని ప్రభావితం చేసే హార్మోన్లను నియంత్రిస్తుంది.అందువల్ల, ఒత్తిడితో బాధ పడే వారు ఖచ్చితంగా డైట్‌లో బొప్పాయి పండును చేర్చుకోవడం మంచిది.
అలాగే అరటి పండు కూడా ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడేయగలదు.

అరటి పండులో ట్రిప్టోఫాన్ వల్ల శరీరాన్ని ఉత్తేజిత పరిచే సెరోటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది.దాంతో ఒత్తిడి దూరమై.నాడీ వ్యవస్థ చురుగ్గా మరియు వేగంగా పని చేస్తుంది.

కాబట్టి, ఒత్తిడితో ఇబ్బంది పడే వారు రోజూ ఒకటి, రెండు అరటి పండ్లు తీసుకోవడం మేలు.
నారింజ, బెర్రీస్, జామ, కివి వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఈ విటమిన్ సి ఒత్తిడిని నివారించి.మెదడులోని కణాలు యాక్టివేట్ చేయడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.అందుకే ఈ పండ్లును డైట్‌లో చేర్చుకుంటే.ఒత్తిడిని సులభంగా జయించవచ్చు.