దసరా తర్వాత ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే...! మీ రాశి ఉందేమో చూసుకోండి.!     2018-10-13   09:38:57  IST  Sai Mallula

ప్ర‌పంచంలోని ప్ర‌తి వ్యక్తి ఎక్కువ డ‌బ్బును సంపాదించాల‌నే క‌ల‌లు గంటాడు. అందుకోస‌మే ఎవ‌రైనా కృషి చేస్తారు. అయితే కొంద‌రికి మాత్రం డ‌బ్బు చాలా అల‌వోక‌గా ల‌భిస్తుంది. వ‌ద్ద‌నుకున్నా అమిత‌మైన ధ‌నం వ‌స్తుంది. ఇక కొంద‌రికి ఎంత క‌ష్ట‌ప‌డినా ఆశించినంత మేర కాదు క‌దా, అంత‌కు తక్కువ స్థాయిలోనే డ‌బ్బు చేకూరుతుంది. అయితే నిజానికి అది వారి త‌ప్పు కాదు. ఎందుకంటే ఏ వ్య‌క్తి అయినా ఎంత ధ‌నం సంపాదిస్తాడో అది అత‌ని రాశిని బట్టి ఉంటుంద‌ట‌. ఇప్పుడు దసరా తర్వాత అదృష్టం పట్టే రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి ఈ రాశివారు దసరా తరవాత ఏ పని చేసిన విజయాన్ని అందుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే మేషరాశి వారికీ దసరా తర్వాత శుభ ఘడియలు అని చెప్పాలి. ఈ రాశివారికి అధిపతి కుజుడు. అందువల్ల ఈ రాశివారు లక్ష్మీదేవిని,సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అపజయాలు కలగకుండా విజయం వీరి సొంతం అవుతుంది. ఈ రాశివారికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆచి తూచి నిదానంగా తీసుకోవాలి. ఇలా నిదానంగా ఆలోచనలు చేస్తే దసరా తర్వాత వీరికి పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది.

These Four Zodiac Signs Get Good Luck After Dasara-

These Four Zodiac Signs Get Good Luck After Dasara

కర్కాటక రాశి ఈ రాశివారు దసరా తర్వాత పెద్ద పెద్ద పనులను మొదలుపెట్టి విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఏ పనిని అయినా పట్టుదలగా చేస్తారు. కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు. వీరికి ఈ సమయంలో దైవ అనుగ్రహం ఎక్కువగా ఉండుట వలన ఏ పని చేసిన సక్సెస్ గా ముందుకు సాగుతారు. వీరు ఈ సమయంలో డబ్బును పొదుపు చేయటం మంచిది. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తే వీరికి అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

These Four Zodiac Signs Get Good Luck After Dasara-

వృశ్చిక రాశి ఈ రాశివారికి అధిపతి కుజుడు. దసరా తర్వాత వీరు గతంలో చేసి ఆగిపోయిన పనులు మొదలు పెడతారు. అవి విజయవంతం అవుతాయి. దసరా తర్వాత వీరు చేసే పనిలో ధనం సమృద్ధిగా లభిస్తుంది. ఈ రాశివారు శివుణ్ణి ఆరాదిస్తే మంచి జరుగుతుంది. అలాగే అన్ని రాశుల వారు దసరా రోజున గోవుని పూజించాలి.

These Four Zodiac Signs Get Good Luck After Dasara-

కన్యా రాశి కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశివారికి దసరా తరవాత ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే వీరికి రాజకీయాలు బాగా కలిసివస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసిన బాగా కలిసివస్తుంది. అంతేకాక ఉద్యోగం లేనివారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసివచ్చి మంచి స్థాయిలో ఉంటారు. ఈ రాశివారు లక్ష్మి నారాయుణ్ణి,వినాయకుణ్ణి పూజిస్తే అముఞ్చి ఫలితాలు వస్తాయి.

These Four Zodiac Signs Get Good Luck After Dasara-