ఇమ్యూనిటీని త‌గ్గించే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!?

న‌లువైపులా కోర‌లు చాచిన క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎవ‌రిపై దాడి చేస్తుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు.ఈ మాయ‌దారి వైర‌స్ నుంచి మ‌న‌ల్నీ మ‌నం ర‌క్షించుకోవాలంటే ఖ‌చ్చితంగా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాలి.

 These Foods To Decrease Immune System! Bad Foods, Foods, Immune System, Latest N-TeluguStop.com

అందుకే గ‌త ఏడాది కాలం నుంచి ప్ర‌జ‌లంద‌రూ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుకునేందుకు తెగ‌ తాప‌త్రాయ ప‌డుతున్నారు.అందుకోసం తీసుకునే ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు.

అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచే ఆహారాలే కాదు త‌గ్గించే ఆహారాలు కూడా ఉన్నాయి.

అటువంటి ఆహారాల‌కు ఈ క‌రోనా స‌మ‌యంలో ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రి ఇంత‌కీ ఇమ్యూనిటీని త‌గ్గించే ఈ ఆహారాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన ప‌రిచే వాటిలో కాఫీ ఒక‌టి.కాఫీ ఆరోగ్యానికి మంచిద‌ని చాలా మంది చెబుతారు.అది నిజ‌మే.

కానీ, అదే కాఫీని అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు ఇమ్యూనిటీ కూడా లోపిస్తుంది.

అలాగే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది బాగా వేయించిన క‌ర్రీలు, స్నాక్స్ ను ఇష్టంగా తింటుంటారు.కానీ, ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల‌ రోగ నిరోధ‌క శ‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోతుంది.దాంతో అనేక జ‌బ్బులు ఎటాక్ చేస్తాయి.

ఇమ్యూనిటీని త‌గ్గించే ఆహారాల్లో షుగ‌ర్ ఒక‌టి.అందుకే షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్లు తిన‌డం, కాఫీ మరియు టీలో షుగ‌ర్ వేసి తీసుకోవ‌డం ఎంత త‌గ్గిస్తే అంత మంచిది.అయితే షుగ‌ర్‌కు బ‌దులుగా బెల్లం వాడుకోవ‌చ్చు.బెల్లం వ‌ల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ల‌భిస్తాయి.

ఇక ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా రోగ నిరోధక వ్య‌వ‌స్థ దెబ్బ తింటుంది.కాబ‌ట్టి, ఉప్పు ఎక్కువ‌గా ఉండే చిప్స్, బేకరీ ఐటమ్స్, డిసర్ట్స్ వంటి ప్యాకేజింగ్‌ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

These Foods To Decrease Immune System! Bad Foods, Foods, Immune System, Latest News, Health Tips, Good Health, Health, Corona Virus, Covid-19, - Telugu Bad Foods, Corona, Covid, Foods, Tips, Immune System, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube